కేరళలో సీఎం విజయన్ ప్రభుత్వంపై అవిశ్వాసం, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

| Edited By: Anil kumar poka

Aug 24, 2020 | 12:13 PM

కేరళ అసెంబ్లీలో సోమవారం  ప్రతిపక్షాలు సీఎం పినరయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ తీర్మానంపై అయిదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరగనుంది.

కేరళలో సీఎం విజయన్ ప్రభుత్వంపై అవిశ్వాసం, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
Follow us on

కేరళ అసెంబ్లీలో సోమవారం  ప్రతిపక్షాలు సీఎం పినరయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ తీర్మానంపై అయిదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరగనుంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో విజయన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు గాను ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసునిచ్చాయి.  ఆయన రాజీనామా చేయాల్సిందేనని విపక్షనేత రమేష్ చెన్నితాల కోరుతున్నారు. తమ తీర్మానంపై రెండు రోజులపాటు చర్చ జరగాలని విపక్షాలు కోరుతున్నప్పటికీ స్పీకర్ అయిదు గంటల పాటు మాత్రమే చర్చకు అనుమతించారు.

140 మంది సభ్యులున్న శాసన సభలో పాలక పార్టీ   (ఎల్ డీ ఎఫ్) కి చెందిన 91 మంది, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కి చెందిన 45 మంది, బీజేపీ, ఇండిపెండెంట్ సభ్యులు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.