ఫేస్ బుక్ వివాదం, శశి థరూర్ పై బీజేపీ ఫిర్యాదు

| Edited By: Pardhasaradhi Peri

Aug 20, 2020 | 5:46 PM

ఫేస్ బుక్ వివాదం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పెను వివాదంగా మారింది. కాంగ్రెస్ నేత శశి థరూర్ ని పార్లమెంట్ పానెల్ చైర్మన్ పదవి నుంచి..

ఫేస్ బుక్ వివాదం, శశి థరూర్ పై బీజేపీ ఫిర్యాదు
Follow us on

ఫేస్ బుక్ వివాదం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పెను వివాదంగా మారింది. కాంగ్రెస్ నేత శశి థరూర్ ని పార్లమెంట్ పానెల్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే..లోక్ సభ స్పీకర్ కి లేఖ రాశారు.

ఇన్ఫర్మేషన్, టెక్నాలజీలపై గల పార్లమెంటరీ స్థాయీ సంఘానికి శశిథరూర్ చీఫ్ గా ఉన్నారు. ఈ పదవి నుంచి ఆయనను తొలగించాలని దూబే.. స్పీకర్ కి లేఖ  రాయగా, దీన్ని కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ కూడా సమర్థించారు. ఫేస్ బుక్ వివాదంపై థరూర్ తమతో సంప్రదించకుండా మీడియాకు ఎక్కడం సముచితం కాదని వీరన్నారు. అసలు థరూర్ పదవీ కాలమే వివాదాస్పదంగా ఉందని, విదేశీ యాసతో ఇంగ్లీష్ లో మాట్లాడినంత మాత్రాన పార్లమెంటరీ వ్యవస్థలు ఒక వ్యక్తికి స్వేఛ్చనిచ్చినట్టు కాదని దూబే తన లేఖలో పేర్కొన్నారు.

దూబే, శశిథరూర్ ఇద్దరూ ఒకరిపై ఒకరు సభా హక్కుల ఉల్లంఘనల తీర్మానాలను ప్రతిపాదించుకుంటూ నోటీసులిచ్చారు. బీజేపీ నేతలు చేసిన ద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యలను ఫేస్ బుక్  కావాలనే పక్కన పెడుతోందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ లో ప్రచురితమైన ఓ ఆర్టికల్ బీజేపీ- కాంగ్రెస్ పార్టీల మధ్య చిచ్చు రేపింది. రెండు పార్టీల నేతలూ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు.