బర్ద్ ఫ్లూ భయం, మరో మూడు రాష్ట్రాలకు వ్యాపించిన ఫ్లూ, కేంద్రం అప్రమత్తం, మనుషులకు వైరల్ సోకదని అభయం,

| Edited By: Pardhasaradhi Peri

Jan 12, 2021 | 1:20 PM

దేశంలో కొత్తగా మరో మూడు రాష్ట్రాలకు బర్ద్ ఫ్లూ వ్యాపించింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో సోమవారం వందలాది పక్షులు మృతి చెందాయి.

బర్ద్ ఫ్లూ భయం, మరో మూడు రాష్ట్రాలకు వ్యాపించిన ఫ్లూ,  కేంద్రం అప్రమత్తం, మనుషులకు వైరల్ సోకదని అభయం,
Follow us on

Birdflu Spreads: దేశంలో కొత్తగా మరో మూడు రాష్ట్రాలకు బర్ద్ ఫ్లూ వ్యాపించింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో సోమవారం వందలాది పక్షులు మృతి చెందాయి. దీంతో మొత్తం 10 రాష్ట్రాలకు ఇది సోకింది. ఇప్పటికే కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, యూపీ బర్ద్ ఫ్లూతో సతమతమవుతున్నాయి. పౌల్ట్రీ ఫారాలు , చేరుచులు, జూలు వంటివాటి చోట్ల నిఘా పెంచ్జాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సాక్షాత్తూ ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించారు. ఏమైనా. బర్ద్ ఫ్లూ మనుషులకు వ్యాపించదని . ఆ భయం అక్కర్లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు  చికెన్, కోడిగుడ్లు తినవచ్చునని, అయితే బాగా ఉడికించిన వీటినే తినాలని సూచించింది. ఎక్కువ ఉష్ణోగ్రతలో వైరల్ నశించిపోతుందని పేర్కొంది.

వివిధ రాష్ట్రాలు ఇప్పటికే బర్ద్ ఫ్లూ నేపథ్యంలో వివిధ నివారణా చర్యలు చేపట్టాయి. మరణించిన పక్షుల నమూనాలను విశ్లేషిస్తున్నారు . కోడిగుడ్లు, చికెన్ తినవచ్చునని యాడ్స్ ఇస్తున్నాయి.

 

Also Read:

AP Local Polls Controversy Live Updates: ఏపీలో తేలని లోకల్ ‘పంచాయితీ’.. మళ్లీ మొదటికే వచ్చిన ఎస్ఈసీ షెడ్యూల్

Saina Nehwal withdraws Thailand Open: కరోనా పాజిటివ్ తో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ నుంచి భారత్ స్టార్ షట్లర్ ఔట్ ..

‘మాస్టర్’కు పట్టిన పైరసీ భూతం.. ‘ఏడాదిన్నర కష్టమంటూ..’ దర్శకుడి ఎమోషనల్ ట్వీట్..