వైసీపీ సంచలన నిర్ణయం.. నవంబర్ 6 నుంచి ఏపీ వ్యాప్తంగా…

వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్ప యాత్ర మూడేళ్లు అయిన సందర్భంగా

వైసీపీ సంచలన నిర్ణయం.. నవంబర్ 6 నుంచి ఏపీ వ్యాప్తంగా...
Ravi Kiran

|

Nov 01, 2020 | 8:44 AM

YSRCP Key Decision: వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు అయిన సందర్భంగా నవంబర్ 6వ తేదీ నుంచి 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాదాపు 90 శాతానికి పైగా నెరవేర్చమని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి.. వారికి మరేమైనా సమస్యలు ఉన్నాయా.? అని ఈ కార్యక్రమాల ద్వారా తెలుసుకుంటామని అన్నారు. నవంబర్ 6 నుంచి 10 పాటు పార్టీ తరపున నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికను రూపొందిస్తామని స్పష్టం చేశారు. సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలను ప్రజలు చూస్తున్నారన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu