హృతిక్ సినిమాలో విజయ్ సేతుపతి..!

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో క్రిష్ సిరీస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు వచ్చిన మూడు పార్టులు ఘన విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు క్రిష్ 4 సినిమాను తెరకెక్కించేందుకు...

హృతిక్ సినిమాలో విజయ్ సేతుపతి..!
Follow us

|

Updated on: Aug 15, 2020 | 5:41 PM

Vijay Sethupathi In Krrish 4: బాలీవుడ్‌ ఇండస్ట్రీలో క్రిష్ సిరీస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు వచ్చిన మూడు పార్టులు ఘన విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు క్రిష్ 4 సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాత రాకేష్ రోషన్ సన్నాహాలు మొదలుపెట్టారు. హృతిక్ రోషన్ హీరోగా రూపొందనున్న క్రిష్ 4 ఈ సారి హాలీవుడ్‌ను ఆకర్షించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో హృతిక్ రోషన్ నాలుగు పాత్రల్లో కనిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్కిప్టు పనులు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తాడని టాక్. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిగినట్లు సమాచారం. కృతి సనన్ హీరోయిన్‌గా నటించనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Also Read:

దేశంలో డిసెంబర్ వరకు స్కూళ్ళు మూసివేత.. నిజమేనా.?