వైట్ హౌస్ వద్ద ‘ మిలియన్ మెగా మార్చ్’, పోలీసులూ ! రెచ్చిపోండి ! నిరసనకారుల పని పట్టండి !ట్రంప్ పిలుపు

| Edited By: Pardhasaradhi Peri

Nov 15, 2020 | 4:09 PM

అమెరికా ఎన్నికల్లో తాను ఓడిపోవడంతో డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా తన మద్దతుదారులను రెచ్ఛ గొడుతున్నారు. శనివారం రాత్రి వైట్ హౌస్ వద్ద ' మిలియన్ మెగా మార్చ్'..

వైట్ హౌస్ వద్ద  మిలియన్ మెగా మార్చ్, పోలీసులూ ! రెచ్చిపోండి !  నిరసనకారుల పని పట్టండి !ట్రంప్ పిలుపు
Follow us on

అమెరికా ఎన్నికల్లో తాను ఓడిపోవడంతో డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా తన మద్దతుదారులను రెచ్ఛ గొడుతున్నారు. శనివారం రాత్రి వైట్ హౌస్ వద్ద ‘ మిలియన్ మెగా మార్చ్’ పేరిట  వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించి ట్రంప్ అనుకూల నినాదాలు చేస్తూ ప్రదర్శనకు దిగారు. అటు జో బైడెన్ కి మద్దతునిస్తున్న  సపోర్టర్లు.. ప్రౌడ్ బాయ్స్’  మేమంటూ వారికి వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. వారికి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమ సభ్యులు కూడా బాసటగా నిలవడంతో రెండు పక్షాల మధ్య ఘర్షణలు రేగాయి. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. దీంతో ట్రంప్  పోలీసులను రెచ్చగొడుతూ నిరసనకారుల పని పట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. కొందరు ఆందోళనకారులు పోలీసుల పైకి ఫైర్ వర్క్స్ ని, బాటిల్స్ ని విసిరారు. దీంతో  కొన్ని  వందలమందిని పోలీసులు అరెస్టు చేశారు.   గత మే నెలలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ను మినియాపోలిస్  పోలీసులు హతమార్చినప్పటి నుంచి ట్రంప్ పై నల్లజాతీయులు ఆగ్రహంతో రెచ్చిపోతున్నారు. తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు జో బైడెన్ అధ్యక్షుడు కావడంతో వారు ప్రౌడ్ బాయ్స్ కి మద్దతునిస్తున్నారు.

Video & Image Courtesy : Mail Online