ఆక్వా రైతులకు జగన్ సర్కార్ శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న ఆక్వా రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కరోనా భయం ఒకవైపు, లాక్ డౌన్ మరొకవైపు ఆక్వా రంగాన్ని కుదేలు చేస్తున్నాయంటూ రైతంగం గగ్గోలు పెడుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం అక్వా రైతులను ఆదుకునేందుకు నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకటించింది.

ఆక్వా రైతులకు జగన్ సర్కార్ శుభవార్త
Follow us

|

Updated on: Apr 04, 2020 | 4:52 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న ఆక్వా రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కరోనా భయం ఒకవైపు, లాక్ డౌన్ మరొకవైపు ఆక్వా రంగాన్ని కుదేలు చేస్తున్నాయంటూ రైతంగం గగ్గోలు పెడుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం అక్వా రైతులను ఆదుకునేందుకు నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకటించింది. శనివారం మత్స్య శాఖా మంత్రి, అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష జరిగిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… అక్వా రంగాన్ని ఆదుకునేందుకు తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మోపిదేవి వెంకట రమణ మీడియాకు వివరించారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రైతులు పండించిన పంటలు, ఆక్వా రంగం ఉత్పత్తులకు నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఎగుమతులపై ఇప్పుడిప్పుడే చైనా కొన్ని సడలింపులు ఇస్తుందని, 2830 మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు నాలుగు రోజుల్లో ఎగుమతి చేశామని మంత్రి వివరించారు. సోమవారం నుంచి ఫీల్డ్‌కు వెళ్లి ఎక్స్‌పోర్ట్స్ మీద ఒత్తిడి తెచ్చి వాస్తవ ధరకే కొనుగోళ్లు జరిగేలా చూస్తామని మోపిదేవి అంటున్నారు. ఆక్వా ఉత్పత్తులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించిందని, దానికంటే తక్కువ ధర చెల్లించి ఎవరైనా కొనుగోలు చేస్తామని వారి లైసెన్సులు రద్దు చేస్తామని మంత్రి అన్నారు. నాలుగు లక్షల రొయ్యల ఉత్పత్తి జరుగుతుందని, దీనికి కావాల్సిన సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటామని తెలిపారు.

దళారీ వ్యవస్థ చాలా ప్రమాదకరమైన నేపథ్యంలో దాన్ని లేకుండా చేస్తున్నామని, ఆక్వా రంగానికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. రైతుల్లో అభద్రతా భావం వద్దని, ఎక్స్‌పోర్ట్స్ మీద ఒత్తిడి తెచ్చి మార్కెట్ ధరకే రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గగానే సడలింపు ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి మోపిదేవి.

Latest Articles
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా