GHMC Elections 2020: బంజారాహిల్స్‌లోని పలు డివిజన్ల పరిధిలో ఉద్రిక్తత..టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం

గ్రేటర్‎లో ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. పలు డివిజన్ల పరిధిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎన్. బి.టి నగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం..

GHMC Elections 2020: బంజారాహిల్స్‌లోని పలు డివిజన్ల పరిధిలో ఉద్రిక్తత..టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం
Follow us

|

Updated on: Dec 01, 2020 | 5:59 PM

గ్రేటర్‎లో ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. పలు డివిజన్ల పరిధిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎన్. బి.టి నగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎన్. బి.టి నగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. కాషాయం రంగు మాస్కులు పెట్టుకొని పోలింగ్ బూత్ వద్ద కు వస్తున్నారని టీఆర్‌ఎస్‌ వర్గీయులు, చేతికి గులాబీ రంగు కంకణాలు కట్టుకుని వచ్చారంటూ బీజేపీ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. గులాబీ కండువాలతో పోలింగ్ స్టేషన్ లోకి ప్రవేశించిన బంజారాహిల్స్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మిపై బీజేపీ కార్యకర్తలు తప్పుబట్టారు. విజయలక్ష్మీ తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ స్టేషన్లను 43, 44, 45, 46, 47, 48, 49 పోలింగ్‌ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

అటు, మన్సూరాబాద్ డివిజన్(12)లో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సహారా ఎస్టేట్ లో పరిగి నుండి వచ్చిన టిఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీంగ్‌ కేంద్రం వద్ద బీజేపీ వర్గీయులు ఆందోళన చేపట్టారు.