GHMC Elections 2020: పోలింగ్‌కు ఆసక్తి చూపని టెకీలు

|

Dec 01, 2020 | 5:59 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ఎంఎన్‌సీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు దూరంగా ఉన్నారా అంటే పోలింగ్‌ సరళి అవుననే సమాధానం ఇస్తుంది. మధ్యాహ్నం 12 గంటలు దాటినా 20 శాతం..

GHMC Elections 2020: పోలింగ్‌కు ఆసక్తి చూపని టెకీలు
Follow us on

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ఎంఎన్‌సీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు దూరంగా ఉన్నారా అంటే పోలింగ్‌ సరళి అవుననే సమాధానం ఇస్తుంది. మధ్యాహ్నం 12 గంటలు దాటినా 20 శాతం పోలింగ్‌ కూడా నమోదు కాకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఓటింగ్‌లో పాల్గొనాలని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసే టెకీలు ఓటింగ్‌కు దూరంగా ఉండటం పలు విమర్శలకు తావిస్తుంది. మూడు రోజులు వరుస సెలవులు రావడంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లంతా నగరం విడిచి వెళ్లినట్టు తెలుస్తుంది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టెకీలు ఓటింగ్‌కు మాత్రకం దూరమయ్యారు. మరోవైపు ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుందని ఓటింగ్‌లో పాల్గొన్న ప్రముఖులంటున్నారు. మొత్తానికి ఓటింగ్‌లో పాల్గొనని వారిపై విమర్శల వెల్లువెత్తుతున్నాయి.