కరోనాపై చైనా అధినేతతో మాట్లాడతా.. డోనాల్డ్ ట్రంప్

| Edited By: Anil kumar poka

Mar 27, 2020 | 11:22 AM

అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 82,404 కరోనా కేసులతో ఈ దేశం ఇటలీ, చైనా దేశాలను మించిపోయింది.. దీంతో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో ఫోన్ లో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.

కరోనాపై చైనా అధినేతతో మాట్లాడతా.. డోనాల్డ్ ట్రంప్
Follow us on

అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 82,404 కరోనా కేసులతో ఈ దేశం ఇటలీ, చైనా దేశాలను మించిపోయింది.. దీంతో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో ఫోన్ లో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. అయితే తన ప్రయత్నం సఫలం కాకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. చైనాలో ఎంతమంది కరోనా బాధితులు మరణించారో , ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితి ఎలా ఉందో తెలియదన్నారు. నాకు, జీ జిన్ పింగ్ కు మధ్య మంచి సఖ్యత అయితే ఉందని చెప్పిన ఆయన.. ఈ ఏడాది నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నేను ఓడిపోతానేమో.. అంతవరకు వేచి చూద్దామని జిన్ పింగ్ భావిస్తూ ఉండవచ్ఛునని కూడా వ్యాఖ్యానించారు. నా ప్రత్యర్థి జో బిడెన్ అమెరికా అధినేత కావాలని చైనా ఆశిస్తున్నట్టు కనబడుతోందన్నారు. చైనావైరస్, వూహాన్ వైరస్ అని తాను ఆరోపించడాన్ని సమర్థించుకున్న ట్రంప్.. అమెరికా సైన్యమే ఈ వైరస్ కు కారణమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించాడని, అందువల్లే తన ఆరోపణను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. కరోనా విషయంలో తమ రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్న విషయం వాస్తవమేనని ట్రంప్ అంగీకరించారు.