ఏపీలో ఆ కార్డు ఉంటేనే క‌రోనా సాయం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చాక జారీ చేసిన‌ బియ్యం కార్డుదారులకు మాత్రమే కరోనా సాయం అందనుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసింది. రాష్ట్రంలో గ‌తంలో రేషన్ సరుకులు తీసుకునేందుకు కోటీ 47 లక్షల తెల్లరేషన్‌ కార్డులు క‌లిగిఉన్న ల‌బ్దిదారులు ఉండగా…వైఎస్​ఆర్ నవశకం పేరిట సర్కార్ తాజ‌గా బియ్యం కార్డులను కోటీ 29 లక్షల కుటుంబాలకు పంపిణీ చేసింది. ఇప్పుడు బియ్యం కార్డుల‌నే కరోనా ఆర్థిక సాయానికి ప్రామాణికంగా ప‌రిగ‌ణించ‌నున్నారు. దీంతో రాష్ట్ర […]

ఏపీలో ఆ కార్డు ఉంటేనే క‌రోనా సాయం..!
Follow us

|

Updated on: Apr 03, 2020 | 8:01 AM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చాక జారీ చేసిన‌ బియ్యం కార్డుదారులకు మాత్రమే కరోనా సాయం అందనుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసింది. రాష్ట్రంలో గ‌తంలో రేషన్ సరుకులు తీసుకునేందుకు కోటీ 47 లక్షల తెల్లరేషన్‌ కార్డులు క‌లిగిఉన్న ల‌బ్దిదారులు ఉండగా…వైఎస్​ఆర్ నవశకం పేరిట సర్కార్ తాజ‌గా బియ్యం కార్డులను కోటీ 29 లక్షల కుటుంబాలకు పంపిణీ చేసింది. ఇప్పుడు బియ్యం కార్డుల‌నే కరోనా ఆర్థిక సాయానికి ప్రామాణికంగా ప‌రిగ‌ణించ‌నున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం అందించే రూ. వెయ్యి సాయం ద‌క్క‌దు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నో సంవ‌త్స‌రాలుగా రేషన్‌ కార్డుల వ్యవస్థే నడుస్తుంది. కానీ జ‌గ‌న్ స‌ర్కార్ బోగ‌స్ కార్డుల‌ను ఏరివేసేందుకు వాటిని పక్కనపెట్టి కొత్తగా బియ్యం కార్డులను తీసుకొచ్చింది. వీటి ఆధారంగానే ఈ నెల నుంచి రేషన్‌ సరుకులు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల కార‌ణంగా పాత రేషన్‌కార్డుల జాబితా ప్రకారమే కోటీ 40 లక్షల కుటుంబాలకు పంపిణీ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అందించే రూ. వెయ్యి సాయం మాత్రం బియ్యం కార్డుల ఆధారంగా అందించాలని రెవెన్యూశాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.