Vastu Tips: తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు

ప్రతీ ఒక్కరి ఇంట్లో కచ్చితంగా తులసి మొక్క ఉంటుందని తెలిసిందే. తులసి మొక్కను హిందువులు దైవంగా భావించి పూజలు కూడా చేస్తుంటారు. అందుకే తులసిని అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. స్నానం చేయకుండా తులసి మొక్కకు నీరు కూడా పోయరు. అయితే మనలో కొందరు తెలిసో తెలియకో తులసి మొక్క విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు..

Vastu Tips: తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
Tulasi
Follow us

|

Updated on: Apr 20, 2024 | 1:07 PM

ప్రతీ ఒక్కరి ఇంట్లో కచ్చితంగా తులసి మొక్క ఉంటుందని తెలిసిందే. తులసి మొక్కను హిందువులు దైవంగా భావించి పూజలు కూడా చేస్తుంటారు. అందుకే తులసిని అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. స్నానం చేయకుండా తులసి మొక్కకు నీరు కూడా పోయరు. అయితే మనలో కొందరు తెలిసో తెలియకో తులసి మొక్క విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటివల్ల ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* అత్యంత పవిత్రంగా భావించే తులసి కోట వద్ద ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు లేదా బూట్లను వదలకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. తులసిని లక్ష్మీవేదికి ప్రతిరూపంగా భావించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

* ఇక తులసి మొక్క ఉన్న చోట డస్ట్‌ బిన్‌లను కూడా ఏర్పాటు చేయకూడదు. ఇలా చేసినా ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

* అలాగే తులసి మొక్క చాలా పవిత్రమైనది మరియు పూజనీయమైనది. కాబట్టి తులసి మొక్క వద్ద చీపురును కూడా పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేసినా ఆర్థిక సమస్యలు తప్పవని అంటున్నారు.

* తులసి మొక్కకు సమీపంలో ముళ్ల మొక్కలు లేకుండా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇది ఆర్థికపరిస్థితిపైనే కాకుండా ఇంట్లో ఉండే వ్యక్తుల మానసిక ఆలోచనలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

* ఇక తులసి మొక్కను కచ్చితంగా ఈశాన్యం లేదా తూర్పు దిక్కులో ఉండేలా చూసుకోవాలి. అలాగే తులసి మొక్కకు తగినంతా సూర్య రక్ష్మి లభించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

* తులసి మొక్క ఉన్న చోట శివలింగాన్ని ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. ఇది వెనకాల ఒక పురాణ ఇతిహాసం కూడా ఉంది. దీని ప్రకారం.. తులసి పూర్వ జన్మలో జలంధరుడనే రాక్షసుడి భార్య వృంద. ఈ రాక్షసుని శివుడే వధించాడు. అందువల్ల ఎప్పుడూ కూడా శివలింగం దగ్గర తులసి దళాన్ని పెట్ట కూడదని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి