రైస్​ కుక్కర్​తో ఫేస్​ మాస్క్​ల శానిటైజ్ ‌చేయొచ్చ‌ట‌‌ !

ప్రస్తుత ‌క‌రోనా వ్యాప్తి స‌మయంలో ఫేస్ మాస్క్ మ‌నుషుల‌కు సంజీవ‌నిగా మారింది. అయితే రోజుకొక‌టి చొప్పున‌ ఫేస్ మాస్క్ పెట్టుకోవాలంటే పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు కాస్త ఖ‌ర్చుతో కూడుకున్న విష‌యం.

రైస్​ కుక్కర్​తో ఫేస్​ మాస్క్​ల శానిటైజ్ ‌చేయొచ్చ‌ట‌‌ !
Follow us

|

Updated on: Aug 10, 2020 | 3:00 PM

Electric cookers can disinfect N95 masks : ప్రస్తుత ‌క‌రోనా వ్యాప్తి స‌మయంలో ఫేస్ మాస్క్ మ‌నుషుల‌కు సంజీవ‌నిగా మారింది. అయితే రోజుకొక‌టి చొప్పున‌ ఫేస్ మాస్క్ పెట్టుకోవాలంటే పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు కాస్త ఖ‌ర్చుతో కూడుకున్న విష‌యం. ఈ క్ర‌మంలో చాలామంది ఉపయోగించిన మాస్కుల‌నే మ‌ళ్లీ, మ‌ళ్లీ వినియోగిస్తున్నారు. ఇలాంటి మాస్క్​లను క్లీన్ చేయడం కూడా కాస్త క‌ష్ట‌త‌ర‌మైన విష‌య‌మే. సబ్బు, స‌ర్ఫ్‌తో కడిగినా మాస్క్​లు పూర్తిగా శుభ్రం అవుతాయన్న నమ్మకం లేదు.

అయితే ..ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ రైస్​ కుక్కర్​, హీట్​ పాట్‌ల‌తో మాస్కుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా క్లీన్ చేయ‌వ‌చ్చ‌ని అమెరికా సైంటిస్టులు క‌నుగొన్నారు. ​ఎన్​95 మాస్క్​లను 50 నిమిషాలపాటు కుక్కర్​లలో 100 డిగ్రీ సెంటీగ్రేడ్​ వద్ద హీట్ చేయడం ద్వారా అవి పూర్తిగా క్లీన్ అవుతాయ‌ని క‌నుగొన్నారు. ఈ పద్ధతి ద్వారా ఎన్​95 మాస్క్​ల ఫిల్టర్​లూ బాగా వ‌ర్క్ చేస్తాయని చెబుతున్నారు. ఈ పద్ధతిలో 20 సార్లు మాస్క్‌ను శానిటైజ్ చేయొచ్చని పేర్కొన్నారు. ఇల్లినాయీ యూనివ‌ర్సిటీ సైంటిస్టులు చేసిన ఈ పరిశోధనలో భారతీయ మూలాలున్న ప్రొఫెసర్​ విశాల్ వర్మ కూడా భాగస్వామిగా ఉన్నారు.

Also Read : బంగా‌ళా‌ఖా‌తంలో అల్ప‌పీ‌డనం : తెలంగాణ‌లో విస్తారంగా వ‌ర్షాలు