ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు.. జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం..

  • Tv9 Telugu
  • Publish Date - 6:05 am, Sun, 5 July 20
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు.. జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

AP Government Employees: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందించింది. జూలై 6, 7 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ద్రవ్యవినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఏపీ ప్రభుత్వం శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో జీతాలు, పెన్షన్లు పడే అవకాశం ఉంది. గెజిట్‌ నోటిఫికేషన్‌ వచ్చాకే బిల్లులు తయారు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Also Read: యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్డిసివిర్ డోసేజ్‌లో మార్పులు: కేంద్రం