నెలరోజులకు చేరిన రైతుల ఆందోళన, ఢిల్లీలోని టిక్రీ సరిహద్దుతో పాటు సింఘు బోర్డర్‌, ఢిల్లీ – ఘజియాబాద్‌ సరిహద్దుల్లో కోలాహలం

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన నెలరోజులకు చేరుకుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మూడు..

నెలరోజులకు చేరిన రైతుల ఆందోళన, ఢిల్లీలోని టిక్రీ సరిహద్దుతో పాటు సింఘు బోర్డర్‌, ఢిల్లీ - ఘజియాబాద్‌ సరిహద్దుల్లో కోలాహలం
Follow us

|

Updated on: Dec 26, 2020 | 3:50 PM

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన నెలరోజులకు చేరుకుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అలా చేయగానే తాము ఇళ్లకు వెళ్లిపోతామని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు వెల్లడించారు. తమను ఎవరు రెచ్చగొట్టడం లేదని, ప్రభుత్వం చట్టాలను రద్దు చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. విపక్షాలు తమ ఉద్యమం వెనుక ఉన్నట్టు ప్రధాని మోదీ చేసిన విమర్శల్లో నిజం లేదని రైతు సంఘాల నేతలన్నారు. ఢిల్లీ లోని టిక్రీ సరిహద్దుతో పాటు సింఘు బోర్డర్‌ , ఢిల్లీ – ఘజియాబాద్‌ సరిహద్దుల్లో కూడా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. యూపీ నుంచి వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఢిల్లీ – ఘజియాబాద్‌ సరిహద్దులను బారికేడ్లతో మూసేశారు పోలీసులు. రైతుల ఆందోళన కారణంగా తాజాగా ఎన్‌హెచ్‌ 9తో పాటు ఎన్‌హెచ్‌ 24ను కూడా మూసేశారు. హర్యానా -రాజస్థాన్‌ సరిహద్దుల్లో కూడా తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. రాజస్థాన్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైతులను హర్యానా సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు పోలీసులు. మరోవైపు కేంద్రం పంపించిన తాజా లేఖపై రైతు సంఘాలు సమావేశమవుతున్నాయి.

Latest Articles