ఆంధ్రప్రదేశ్ లోక్ సభ నియోజకవర్గాలు

ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలలో ఒకటి. ఇది విస్తీర్ణంలో దేశంలో ఏడవ అతిపెద్ద రాష్ట్రం. ఇది తీరప్రాంత రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్‌కు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. 974 km (605 mi)తో భారతదేశంలో రెండవ అతి పొడవైన తీరప్రాంతం కూడా రాష్ట్రం కలిగి ఉంది. ఈ రాష్ట్రం 1 నవంబర్ 1956న ఏర్పాటైంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది.

జూన్ 2, 2014న ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్రను తెలుగుదేశం పార్టీ ఐదేళ్లు (2014-19), వైసీపీ ఐదేళ్లు (2019-2014) పాలించాయి. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు, రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పనిచేశారు.

అమరావతి రాష్ట్రానికి కొత్త రాజధాని ఉన్నప్పటికీ.. దీన్ని విశాఖపట్నంకు తరలించాలని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అమరావతిలోనే కొనసాగించాలని టీడీపీ, జనసేన తదితర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అలాగే 11 మంది ఎంపీలు ఇక్కడి నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ స్థానాల జాబితా

రాష్ట్రం సీటు పార్లమెంటు సభ్యుడు పార్టీ
Andhra Pradesh Kadapa Y S Avinash Reddy వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Tirupati Balli Durga Prasad Rao వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Hindupur Kuruva Gorantla Madhav వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Guntur Jayadev Galla టీడీపీ
Andhra Pradesh Vijayawada Kesineni Srinivasa (Nani) టీడీపీ
Andhra Pradesh Visakhapatnam M V V Satyanarayana వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Ongole Magunta Sreenivasulu Reddy వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Rajampet P V Midhun Reddy వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Narsapuram Kanumuru Raghu Rama Krishna Raju వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Kurnool Ayushman Doctor Sanjeev Kumar వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Aruku Goddeti Madhavi వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Rajahmundry Margani Bharat వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Anantapur Talari Rangaiah వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Nandyal Pocha Brahmananda Reddy వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Kakinada Vanga Geethaviswanath వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Eluru Kotagiri Sridhar వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Vizianagaram Bellana Chandra Sekhar వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Srikakulam Kinjarapu Ram Mohan Naidu టీడీపీ
Andhra Pradesh Narasaraopet Lavu Sri Krishna Devarayalu వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Amalapuram Chinta Anuradha వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Nellore Adala Prabhakar Reddy వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Machilipatnam Balashowry Vallabhaneni వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Bapatla Nandigam Suresh వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Chittoor N Reddeppa వైఎస్‌ఆర్‌సీపీ
Andhra Pradesh Anakapalli Dr Beesetti Venkata Satyavathi వైఎస్‌ఆర్‌సీపీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు 25 లోక్‌సభ‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో YSRCP ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ 22 సీట్లు గెలుచుకుంది.

నాటి ఎన్నికల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ వంటి జాతీయ పార్టీలు ఖాతా తెరవలేకపోయాయి. అదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఘోర పరాజయాన్ని చవిచూసింది.  కేవలం 3 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలుచుకోగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 3 సీట్లుకు పరిమితమయ్యింది. 

జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్సీపీ గతంలోని పనితీరును మెరుగుపరుచుకుని భారీ విజయాన్ని సాధించింది.  సినీ నటుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ 18 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినా ఒక్క సీటు కూడా తన ఖాతాలోకి రాలేదు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సీపీఎం, సీపీఐలు కూడా ఆ ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందాయి. 

ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయి?

సమాధానం - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

ప్రశ్న - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరు?

సమాధానం - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ప్రశ్న - 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది?

సమాధానం - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకుంది.

ప్రశ్న - 2014తో పోలిస్తే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఎన్ని సీట్లు కోల్పోయింది?

సమాధానం: టీడీపీ 12 సీట్లు కోల్పోయింది. 2014లో 15 స్థానాల్లో గెలిచిన టీడీపీ.. 2019 ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. 

ప్రశ్న: 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్పీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంది?

సమాధానం - జనసేన పార్టీ

ప్రశ్న - ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది?

సమాధానం - 25 లోక్‌సభ నియోజకవర్గాలు. అయితే అన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఓటమిచెందారు.

ప్రశ్న - 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని పార్టీల అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు?

సమాధానం – 2 పార్టీల అభ్యర్థులు (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ)

ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని శాతం ఓట్లు వచ్చాయి?

సమాధానం - 49.89%

ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల శాతం ఎంత?

సమాధానం - 80.38%

ఎన్నికల వార్తలు 2024