నర్సాపురం లోక్‌సభ ఎన్నికల ఫలితాల వార్తలు - Narsapuram Lok Sabha Constituency Election Result
Bhupathi Raju Srinivasa Varma |
707343 |
BJP |
Won |
Umabala Guduri |
430541 |
YSRCP |
Lost |
K.B.R.Naidu |
35213 |
INC |
Lost |
Prasanna Kumar Undurthi |
6364 |
IND |
Lost |
Sirra Raju |
6014 |
BSP |
Lost |
Medapati Venkata Varahala Reddy |
5969 |
IND |
Lost |
Balagam Nayakar |
5240 |
IND |
Lost |
Nalli Rajesh |
4684 |
IND |
Lost |
Ketha Sreenu |
3145 |
IND |
Lost |
Olety Nagendra Krishna |
3116 |
JRBHP |
Lost |
Addepalli Veera Venkat Subba Rao |
2783 |
IND |
Lost |
Anand Chandulal Jasti |
2726 |
IND |
Lost |
Ganji Purnima |
1649 |
RPI(A) |
Lost |
Gedala Laxmana Rao |
1527 |
IND |
Lost |
Gottumukkala Shivaji |
1384 |
IND |
Lost |
Addanki Dorababu |
1393 |
IND |
Lost |
Manne Leela Rama Narendra |
930 |
PPOI |
Lost |
Adinarayana Duppanapudi |
1007 |
IND |
Lost |
Rama Durga Prasad Tholeti |
920 |
IND |
Lost |
Rukhmini |
686 |
IND |
Lost |
Adabala Siva |
683 |
IND |
Lost |
ఆంధ్ర ప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో నరసాపురం లోక్‌సభ స్థానం ఒకటి. ఈ నియోజకవర్గానికి మొదటిసారిగా 1957లో ఎన్నికలు జరిగాయి. నాటి ఎన్నికల్లో సీపీఐ విజయం సాధించింది. ఈ లోక్‌సభ స్థానం పరిథిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండీ, తణుకు, తాడేపల్లిగూడెం ఉన్నాయి. ఈ నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉంది. నరసాపురం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతుండగా.. ఇక్కడ బీజేపీ, టీడీపీలు విజయం సాధించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) కూడా గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి రఘురామ కృష్ణంరాజు ఇక్కడి నుంచి విజయం సాధించారు. 1999లో బీజేపీ నుంచి కృష్ణంరాజు, 2004లో కాంగ్రెస్ నుంచి చేగొండి హరిరామ జోగయ్య, 2009లో కాంగ్రెస్ నుంచి కనుమూరి బాపిరాజు, 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి గోకరాజు గంగరాజు నరసాపురం నుంచి గెలిచారు.
నరసాపురం వసిష్ట గోదావరి నది ఒడ్డున ఉంది. ఇక్కడ లేస్ వర్క్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ నగరాన్ని నృసింగ్‌పురి అని కూడా అంటారు. ఈ నగరానికి నరసింహ భగవానుడి పేరు వచ్చిందని చెబుతారు. క్రమంగా అది నరసింహపురంగా మారి ఇప్పుడు నరసాపురంగామారిందట.
నరసాపురం నగరానికి ఎలా చేరుకోవాలి?
విశాఖపట్నం నుండి నరసాపురంకు 268 కిలోమీటర్ల దూరం ఉంది. రైళ్లు, రోడ్డు మార్గంలో సులభంగా ఇక్కడకు చేరుకోవచ్చు. ఇక్కడి సంస్కృతి గురించి చెప్పాలంటే నరసాపురంలో వసిష్ట గోదావరి నదిలో పుణ్యస్నానం చేసేందుకు ప్రతి పన్నెండేళ్లకోసారి గోదావరి పుష్కరాలు ఘనంగా జరుపుకుంటారు. హిందూ పురాణాలలోని ఏడుగురు గొప్ప ఋషులలో ఒకరైన ప్రసిద్ధ మహర్షి వశిష్ఠ ఈ నదిని తీసుకువచ్చారని చెబుతారు. ఈ ప్రదేశం ఏడాది పొడవునా ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. నగరంలోని ధార్మిక ప్రదేశాలలో ఆదికేశవ ఎంబెరుమానార్ దేవాలయం, 300 సంవత్సరాల నాటి వైష్ణవ దేవాలయం.
నరసాపురం లోక్‌సభ స్థానం ఎవరు, ఎప్పుడు గెలుపొందారు?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1957లో నర్సాపురం లోక్‌సభ స్థానాన్ని సీపీఐ గెలుచుకుంది. ఆ తర్వాత 1962, 1967, 1971, 1977, 1980లో కాంగ్రెస్ విజయం సాధించగా, 1984లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కాంగ్రెస్ గెలుపును నిలిపివేసింది. 1984 తర్వాత 1989, 1991, 1996 వరకు టీడీపీ గెలిచింది. 1998లో కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజు ఇక్కడి నుంచి గెలవగా.. 1999లో బీజేపీ అభ్యర్థి కృష్ణంరాజు ఇక్కడి నుంచి గెలిచారు. 2004, 2009లో కాంగ్రెస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే 2014లో మోదీ వేవ్‌లో బీజేపీ ఇక్కడి నుంచి గెలిచింది. ఆ తర్వాత 2019లో వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఇక్కడి నుంచి గెలిచారు. 2024 ఎన్నికల్లో ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గూడూరి ఉమా బాల, బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ బరిలో నిలుస్తున్నారు.
Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”