గుంటూరు లోక్‌సభ స్థానం - Guntur Lok Sabha Constituency

గుంటూరు లోక్‌సభ స్థానం - Guntur Lok Sabha Constituency

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు లోక్‌సభ స్థానానికి దేశ స్వాతంత్రానంతరం మొదటిసారిగా 1952లో నిర్వహించిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పుతో కలిపి మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే ఈ లోక్‌సభ నియోజకవర్గం గుంటూరు జిల్లా పరిధిలోనే ఉంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మధ్య గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో గట్టి పోటీ నెలకొంటోంది. ఈ రెండు పార్టీలు మినహా మరే ఇతర పార్టీ ఈ సీటు నుంచి గెలవలేదు. 

గుంటూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ మధ్యలో ఉంది. ఈ జిల్లా 198.7 కిమీ చదరపు విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గుంటూరు రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరం. దీనిని రాష్ట్ర హృదయం అని కూడా అంటారు. గుంటూరు మిర్చి, పత్తి, పొగాకు ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా గుంటూరు ఉంటోంది. ఆసియాలో అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డు ఇక్కడ ఉంది. ఇది రాష్ట్రానికి ప్రధాన రవాణా, విద్య, వైద్య, వాణిజ్య కేంద్రంగా కూడా ఉంది. అదే సమయంలో గుంటూరు మున్సిపాలిటీ 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పురాతన మున్సిపాలిటీలలో ఒకటి కావడం విశేషం.

2011 జనాభా లెక్కల ప్రకారం, గుంటూరు జిల్లా జనాభా 20,45,816గా ఉంది.  49.79 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో.. 50.21 శాతం మంది పట్టణ జనాభాలో నివసిస్తున్నారు. ఇక్కడ పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువ. లింగ నిష్పత్తి మేరకు ప్రతి 1000 మంది పురుషులకు 1004 మంది స్త్రీలు ఉన్నారు. 

గుంటూరు లోక్‌సభ స్థానం ఎవరు, ఎప్పుడు గెలిచారు?

స్వాతంత్య్రానంతరం తొలిసారిగా 1952లో గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఆ తర్వాత 1957, 1962, 1967, 1971, 1977, 1980, 1984, 1989 వరకు కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది. 1991లో తొలిసారిగా కాంగ్రెస్‌ను ఓడించిన టీడీపీ, ఆ విజయాన్ని నిలబెట్టుకోలేక 1996లో మళ్లీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. 1998లో కూడా కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 1999లో టీడీపీ విజయం సాధించగా..ఆ తర్వాత 2004, 2009లో కాంగ్రెస్ విజయ పతాకాన్ని ఎగురవేసింది. 2014, 2019లో టీడీపీ నుంచి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

అభ్యర్థి పేరు ఫలితాలు మొత్తం ఓట్లు ఓట్ల శాతం %
Jayadev Galla టీడీపీ గెలుపు 587918 43.50
Modugula Venugopala Reddy వైఎస్‌ఆర్‌సీపీ ఓటమి 583713 43.19
Bonaboyina Srinivasa Rao (Bonaboyina Srinivas Yadav) JNP ఓటమి 129205 9.56
Shaik Mastan Vali కాంగ్రెస్ ఓటమి 14205 1.05
Jayaprakash Narayana Valluru బీజేపీ ఓటమి 11841 0.88
Nota నోటా ఓటమి 6006 0.44
Mannava Hari Prasad సీపీఐఎంఎల్‌ఆర్ ఓటమి 3216 0.24
Dasari Kiran Babu స్వతంత్ర ఓటమి 2909 0.22
Umar Basha Shaik స్వతంత్ర ఓటమి 2676 0.20
Y V Suresh స్వతంత్ర ఓటమి 1947 0.14
Rama Rao Simhadri PRSHP ఓటమి 1746 0.13
Sarabandi Raju Sikhinam ILBPA ఓటమి 1017 0.08
Nagaraju Ekula ఆర్‌పీఐఏ ఓటమి 920 0.07
Araveti Hazarath Rao PPOI ఓటమి 810 0.06
N J Vidya Sagar వీసీకే ఓటమి 641 0.05
Doppalapudi Veera Das స్వతంత్ర ఓటమి 629 0.05
Samudrala Chinna Kotaiah NDDP ఓటమి 628 0.05
Shaik Jaleel NVCP ఓటమి 563 0.04
Ullagi David Jayakumar (Dr D J Kumar) HMRD ఓటమి 447 0.03
Jeldi Raja Mohan AIPP ఓటమి 437 0.03

ఎన్నికల వార్తలు 2024

ఎన్నికల వీడియో