PM Kisan: రైతన్నా లిస్ట్‌లో మీ పేరుందా? ఇప్పుడే చెక్ చేసుకోండి.. నిధులు ఎప్పుడొస్తాయంటే..

|

Apr 27, 2024 | 4:34 PM

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో 16వ విడత నిధులను 2024 ఫిబ్రవరి 28న కేంద్ర విడుదల చేసింది. దేశంలోని దాదాపు 9 కోట్ల మంది రైతులకు రూ.21 వేల కోట్ల పైగా లబ్ధి చేకూరింది. ప్రస్తుతం ఏప్రిల్ - జూలై లో విడుదల చేసే 17వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే విడుదల తేదీపై కచ్చితమైన సమాచారం లేదు. మే నెలలో విడుదల కావచ్చని భావిస్తున్నారు.

PM Kisan: రైతన్నా లిస్ట్‌లో మీ పేరుందా? ఇప్పుడే చెక్ చేసుకోండి.. నిధులు ఎప్పుడొస్తాయంటే..
Pm Kisan
Follow us on

మన దేశ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. దాని మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారందరికీ ఆర్థిక భరోసా కల్పించినప్పుడు సాగు సక్రమంగా జరుగుతుంది. అధిక జనాభా కలిగిన మన దేశంలో ప్రజలందరికీ తిండి దొరకాలంటే వ్యవసాయం బాగుండడం చాలా అవసరం. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. వివిధ పథకాల ద్వారా రైతులను ఆదుకుంటున్నాయి. వాటిలో ముఖ్యమైనది పీఎం కిసాన్ పథకం.

పీఎం కిసాన్ పథకం..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) అనేది దేశంలోని రైతుల ప్రయోజనం కోసం కేంద్రం రూపొందించిన పథకం. వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రోత్సహించడం, రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడం దీని లక్ష్యం. ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి అర్హత కలిగిన రైతులకు రూ. 2వేలు చొప్పున అందజేస్తారు. అంటే ఏడాదికి రూ.6 వేలను అన్నదాతలకు అందిస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్ , డిసెంబర్-మార్చిలో మూడు వాయిదాలుగా డబ్బులు విడుదల అవుతాయి.

మే లో విడుదలయ్యే అవకాశం?

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో 16వ విడత నిధులను 2024 ఫిబ్రవరి 28న కేంద్ర విడుదల చేసింది. దేశంలోని దాదాపు 9 కోట్ల మంది రైతులకు రూ.21 వేల కోట్ల పైగా లబ్ధి చేకూరింది. ప్రస్తుతం ఏప్రిల్ – జూలై లో విడుదల చేసే 17వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే విడుదల తేదీపై కచ్చితమైన సమాచారం లేదు. మే నెలలో విడుదల కావచ్చని భావిస్తున్నారు.

అర్హుల జాబితాలో పేరు ఉందా?

పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో పేరు ఉందో, లేదో రైతులు పరిశీలించుకోవచ్చు. ఈ కింద పద్దతులతో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లండి.
  • పేజీ కుడి మూలలో ఉన్న ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • డ్రాప్-డౌన్ నుంచి రాష్ట్రం, జిల్లా, గ్రామం తదితర వివరాలను ఎంచుకోండి.
  • గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌ను నొక్కండి.
  • లబ్ధిదారుల జాబితా వివరాలు కనిపిస్తాయి. దానిలో మీపేరు చెక్ చేసుకోండి.

ఆన్ లైన్ లో ఈ-కేవైసీ అప్ డేట్ ..

  • పీఎం కిసాన్ పథకం కోసం ఈ-కేవైసీ చాలా అవసరం. దానిని ఆన్ లైన్ లో చేసుకునే వీలుంది.
  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • పేజీ కుడి వైపున కనిపించే ఈకేవైసీ ఎంపికను ఎంచుకోండి.
  • క్యాప్చా కోడ్,ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, సెర్చ్ పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ కార్డ్‌తో నమోదు చేసిన ఫోన్ నంబర్‌ను టైప్ చేయండి.
  • గెట్ ఓటీపై క్లిక్ చేసి, అది వచ్చిన తర్వాత నిర్దేశించిన చోట ఎంటర్ చేయండి.

తిరస్కరణకు గురయ్యే కారణాలు ఇవే..

  • డూప్లికేట్ లబ్ధిదారుని పేరు
  • అసంపూర్ణ కేవైసీ
  • మినహాయింపు వర్గానికి చెందిన రైతులు
  • దరఖాస్తు ఫారమ్‌లో ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పు
  • మూసివేసిన, చెల్లని, బదిలీ చేసిన,బ్లాక్ చేసిన, స్తంభించిన బ్యాంక్ ఖాతాలు
  • బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం కాకపోవడం
  • చెల్లని బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ పేరు
  • చెల్లని ఖాతా, ఆధార్ కార్డు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..