లడాఖ్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం

లడాఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్..లేహ్  ఎన్నికల్లో బీజేపీ 15 సీట్లు గెలుచుకుని విజయం సాధించింది. కాంగ్రెస్ 9 సీట్లలో గెలుపొందింది. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. 

లడాఖ్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 27, 2020 | 9:19 AM

లడాఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్..లేహ్  ఎన్నికల్లో బీజేపీ 15 సీట్లు గెలుచుకుని విజయం సాధించింది. కాంగ్రెస్ 9 సీట్లలో గెలుపొందింది. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు.  తొలిసారి పోటీ చేసిన ఆప్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.  ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ.నడ్డా చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. తమ పార్టీ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఇది ప్రతీక అన్నారు. గత ఏడాది ఆగస్టులో లడాఖ్ ను కేంద్రం..కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినప్పటి నుంచి కౌన్సిల్ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. మొత్తం 26 సీట్లకు గత గురువారం ఎన్నికలు జరిగాయి. 2015 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 17 సీట్లను, కాంగ్రెస్ పార్టీ నాలుగింటిని గెలుచుకున్నాయి.