గ్రామాల్లో హెల్త్‌ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలకు శ్రీకారం   

కరోనా సంక్షోభ కాలంలో.. ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. ఏడాది కాలంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక్క పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారానే

గ్రామాల్లో హెల్త్‌ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలకు శ్రీకారం   
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2020 | 11:51 AM

కరోనా సంక్షోభ కాలంలో.. ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. ఏడాది కాలంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక్క పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారానే రూ.11,192 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు రోడ్డు వసతికి నోచుకోని చాలా గ్రామాలకు కొత్తగా తారు రోడ్లను మంజూరు చేసింది. దెబ్బతిన్న రోడ్డు స్థానంలో రోడ్డు వేయడానికి ఇంకొన్ని చోట్ల అనుమతిచ్చింది.

రాష్ట్రంలోని రూరల్ ఏరియాల్లో హెల్త్‌ క్లినిక్‌ భవనం, రైతు భరోసా  కేంద్రం నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తీసుకొని గత ప్రభుత్వం ఎన్నికలకు ముం దు అనుమతిచ్చిన రూ.4,404 కోట్ల రోడ్ల పనులనూ కలుపుకుంటే గ్రామీణ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు కలిపి మొత్తం రూ.15 వేల కోట్లకు పైబడి ఒక పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా అభివృద్ధి పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది.