America: అమెరికా షట్‌డౌన్.? బైడెన్ బిల్లును తిరస్కరించిన ట్రంప్..
అమెరికా మరోసారి షట్‌డౌన్‌ను ఎదుర్కోబోతోందా అంటే అవుననే అనిపిస్తోంది. 2018-19 మధ్య కాలంలో అమెరికా సుదీర్ఘమైన షట్‌డౌన్‌ను ఎదుర్కొంది. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయా అనిపిస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించిన కీలకమైన బిల్లు ఆమోదం పొందకపోవడతో అమెరికా షట్‌డౌన్ ముప్పును ఎదుర్కొంటోంది.
వాస్తవానికి తొలుత బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ట్రంప్ తిరస్కరించారు. దీంతో ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ మార్చి 14వ తేదీ వరకు ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా సరికొత్త బిల్లును ప్రవేశపెట్టారు. రెండేళ్లపాటు రుణాలపై సీలింగ్‌ను సస్పెండ్ చేయడం వంటి ట్రంప్ డిమాండ్లను ఇందులో చేర్చారు. దీంతో కాబోయే అధ్యక్షుడు కూడా బిల్లుకు మద్దతు తెలుపుతూ.. మిగిలినవారు కూడా సానుకూలంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. దీనిని డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, ప్రతినిధుల సభ దీనిని కూడా 235-174తో తిరస్కరించింది. ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులే డెమోక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. మరోవైపు ప్రస్తుతానికి సెనెట్‌లో డెమోక్రాట్ల పట్టు కొనసాగుతోంది. దీంతో శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో కాంగ్రెస్ విఫలమైతే అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది.
అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాదాపు 8,75,000 మంది పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. వీరిలో చాలామందిని పని ప్రదేశంలో రిపోర్టు చేయొద్దని చెబుతారని బైపార్టీసన్ పాలసీ సెంటర్ డైరెక్టర్ అక్బాస్ వెల్లడించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లోని ఉద్యోగులు సహా వివిధ విభాగాలకు చెందిన మరో 14 లక్షల మంది మాత్రం అత్యవసర సేవలు కొనసాగించాల్సి ఉంటుంది. వీరితో సెలవుల్లో కూడా పని చేయించుకొని చెక్ ఇవ్వరని ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సంఘం పేర్కొంది. షట్‌డౌన్ ముగిశాకే.. వారికి పాత వేతనాలు చెల్లింపులు జరుగుతాయని పేర్కొంది. కొన్ని కాంట్రాక్టుల్లో ఈ చెల్లింపులకు ఎలాంటి హామీలు ఉండవని తెలిపింది. అమెరికా శత్రువులకు ఈ షట్‌డౌన్ ఓ క్రిస్మస్ గిఫ్ట్ అని అభివర్ణించింది. ఇక ముఖ్యంగా రవాణశాఖ, ఇతర రంగాలపై ఈ షట్‌డౌన్ ముప్పు కొనసాగుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.