ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మరోసారి భూమి కంపించింది. 24 గంటల వ్యవధిలో రెండోసారి భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముండ్లమూరు మండలంలో భూమి సెకను పాటు కంపించినట్లు స్థానికులు తెలిపారు. శనివారంనాడు కూడా అదే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.