Sri Sri Daughter: మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా శ్రీశ్రీ కుమార్తె ..? వీడియో..

|

Sep 03, 2023 | 9:29 AM

ఇరవయ్యో శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి.... సంప్రదాయ ఛందోబద్ద కవిత్వాన్ని ధిక్కరించిన విప్లవ కవి.... అభ్యుదయ భావాలతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైతాళికుడు శ్రీశ్రీ తెలియనివారుండరు. ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తుకొచ్చారు అనుకుంటున్నారా.. ఆయన కుమార్తె జస్టిస్‌ నిడుమోలు మాలాను మద్రాస్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా కేంద్రానికి ప్రతిపాదించింది.

ఇరవయ్యో శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి.. సంప్రదాయ ఛందోబద్ద కవిత్వాన్ని ధిక్కరించిన విప్లవ కవి.. అభ్యుదయ భావాలతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైతాళికుడు శ్రీశ్రీ తెలియనివారుండరు. ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తుకొచ్చారు అనుకుంటున్నారా.. ఆయన కుమార్తె జస్టిస్‌ నిడుమోలు మాలాను మద్రాస్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా కేంద్రానికి ప్రతిపాదించింది. గతేడాది మార్చిలో నిడుమోలు మాలా మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ మాలాతో పాటూ ఇతర అదనపు న్యాయమూర్తులు జస్టిస్ ఏఏ నక్కీరన్, జస్టిస్ ఎస్. సౌందర్, జస్టిస్ సుందరమోహన్, జస్టిస్ కె. కుమరేశ్‌బాబును శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..