తెలుగు రాష్ట్రాల్లో గాడిద పాలకు డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. పలు వ్యాధులను నయం చేస్తుందున్న ప్రచారంతో దీనికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. చెంచా గాడిద పాలను ఏకంగా రూ.500లకు విక్రయిస్తున్నారంటే మీరు నమ్మలేకపోవచ్చు. అయితే ఇది పచ్చి నిజం. అయితే ఆరోగ్య నిపుణుల మాత్రం గాడిద పాలకు అంత సీన్ లేదంటున్నారు. గాడిత పాలతో ఆరోగ్యానికి మ్యాజిక్ జరిగిపోతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని చూసిస్తున్నారు.