మూసీనదికి పునరుజ్జీవం తీసుకొచ్చే సంకల్పం తీసుకున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఇందుకోసం శుక్రవారం (నవంబర్ 8) పాదయాత్ర చేపడుతున్నారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. మరోవైపు హైదరాబాద్‌ను పోలి ఉండే సియోల్ నగరాన్ని సందర్శించి, అక్కడి అభివృద్ధి నమూనాను ప్రభుత్వ బృందం అధ్యయనం చేసింది. తాజాగా సీఎం రేవంత్ పాదయాత్ర చేపట్టారు. అంతకు ముందు తన పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్.