విజయవాడ - శ్రీశైలం మధ్య కృష్ణా నదిలో సీ ప్లేన్ ట్రయల్ రన్ సక్సస్ అయ్యింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి బయలుదేరి సీ ప్లేన్ శ్రీశైలం జలాశయం నీటిలో సేఫ్ ల్యాండ్ అయ్యింది. ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, టూరిజయం, ఎయిర్ ఫోర్స్ అధికారుల పర్యవేక్షలో ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. నవంబరు 9న విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సేవలను ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు ఈ సీ ప్లేన్‌ను ప్రారంభిస్తారు.