Python-dog Viral Video: కుక్కను మింగేయాలనుకున్న కొండచిలువ.. స్థానికులు ఊరుకుంటారా మరి.. చుక్కలు చూపించారు.(వీడియో)
సరీసృపాలలో కొండచిలువలు అత్యంత ప్రమాదకరమైనవి. చిరుత, సింహం(Lion), పులి లాంటి క్రూర జంతువులు కూడా వీటిని వేటాడటానికి జంకుతాయి. కుక్కలను, పిల్లులను.. ఏకంగా మనుషులను సైతం కొండచిలువలు(Python) సజీవంగా మింగేస్తాయి.
సరీసృపాలలో కొండచిలువలు అత్యంత ప్రమాదకరమైనవి. చిరుత, సింహం(Lion), పులి లాంటి క్రూర జంతువులు కూడా వీటిని వేటాడటానికి జంకుతాయి. కుక్కలను, పిల్లులను.. ఏకంగా మనుషులను సైతం కొండచిలువలు(Python) సజీవంగా మింగేస్తాయి. తాజాగా కొండచిలువ వేటకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా ఒక క్షణం ఆశ్చర్యపోతారు.ఈ వీడియో ప్రకారం ఓ కుక్క కొండచిలువకు ఎరగా చిక్కినట్లు మీరు చూడవచ్చు. ఆ కుక్కను కొండచిలువ అమాంతం చుట్టేసి సజీవంగా మింగేందుకు సిద్దంగా ఉంటుంది. కొండచిలువ నుంచి ఎటూ తప్పించుకునే మార్గం లేక కుక్క నిస్సహాయంగా కనిపిస్తుంది. అయితే అక్కడే ఉన్న కొంతమంది పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి కుక్క ప్రాణాలను కాపాడేందుకు పరుగులు తీస్తారు.