AP News: బిక్కమొహం.. బిత్తరచూపులు!! ఓ యువకుడ్ని ఆపిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
పోలింగ్ డేట్ దగ్గరపడుతోంది.. పోలీసులూ తమ పని తాము చేసుకునిపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. ఎన్నికల తాయిలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెంలో పోలీసులు ఎన్నికల తనిఖీలు నిర్వహిస్తుండగా..
పోలింగ్ డేట్ దగ్గరపడుతోంది.. పోలీసులూ తమ పని తాము చేసుకునిపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. ఎన్నికల తాయిలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెంలో పోలీసులు ఎన్నికల తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ యువకుడిపై అనుమానమొచ్చింది. బిక్కమొహం, బిత్తరచూపులు చూస్తూ తత్తరపాటుకు గురి కావడం పోలీసులు గమనించారు. దీంతో అతడ్ని ఆపి.. తన దగ్గరున్న బ్యాగ్ చెక్ చేయగా.. రూ. 22.95 లక్షలు లభ్యమయ్యాయి. డబ్బు ఎవరిది.? ఎలా వచ్చాయి.? అని పోలీసులు సదరు యువకుడ్ని ప్రశ్నించగా.. తాను ఇటీవలే ఇల్లు అమ్మానని.. దానికి చెందిన నగదు తీసుకుని వెళ్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే పోలీసులు మాత్రం ఆ డబ్బుకు సంబంధించి ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు.