Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.! మరోసారి ఆంక్షలు..

|

Aug 13, 2024 | 10:12 PM

తిరుమల వెళ్లే భక్తుల్ని టీటీడీ అలర్ట్ చేసింది. చాలా రోజుల తర్వాత తిరుమల రెండు ఘాట్ రోడ్లలో మరోసారి ఆంక్షలు అమలు చేస్తోంది టీటీడీ. ఘాట్‌ రోడ్లలో రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే టూవీలర్స్‌ ను అనుమతిస్తారు. ఈరోజు నుంచి సెప్టెంబర్ 30 వరకు తిరుమల ఘాట్ రోడ్డులో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వన్య మృగాల సంచారం ఎక్కువగా ఉంటుంది..

తిరుమల వెళ్లే భక్తుల్ని టీటీడీ అలర్ట్ చేసింది. చాలా రోజుల తర్వాత తిరుమల రెండు ఘాట్ రోడ్లలో మరోసారి ఆంక్షలు అమలు చేస్తోంది టీటీడీ. ఘాట్‌ రోడ్లలో రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే టూవీలర్స్‌ ను అనుమతిస్తారు. ఈరోజు నుంచి సెప్టెంబర్ 30 వరకు తిరుమల ఘాట్ రోడ్డులో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వన్య మృగాల సంచారం ఎక్కువగా ఉంటుంది.. అందుకే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కనిపించడంతో… తిరుమల ఘాట్ రోడ్డులో రాత్రి తొమ్మిది గంటల తర్వాత టూ వీలర్లను అనుమతించకూడదని నిర్ణయించారు. అలాగే కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులకు రక్షణ చర్యలు పెంచాలని డిసైడ్ చేశారు. ఈ మార్పుల్ని గమనించి తిరుమల వచ్చే శ్రీవారి భక్తులు తమకు సహకరించాలని అటవీశాఖ, టీటీడీ అధికారులు కోరారు. అలిపిరి లోని సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రం, తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ వద్ద ఘాట్ రోడ్డు లో బైక్స్ ను అనుమతించే టైమింగ్స్.. భక్తులకు తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేశారు. దీనిపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. చిరుత సంచారంతో… డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సూచనల మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.