గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విరుచుకపడ్డారు. సమోసాలకే రూ.9 కోట్లు ఖర్చు పెట్టారంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం పూర్తి బాధ్యతారాహిత్యంగా పనిచేసిందని దుయ్యబట్టారు. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వం పనిచేసిందని మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.