వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్న విషయంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పవన్.. తన పని తాను చేస్తున్నాను.. పోలీసులు పని వాళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ తాను చూడడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడెందుకు తటపటాయిస్తున్నారనే విషయాన్ని సీఎం అడుగుతానన్నారు.