Uppena Teaser: వైరల్‌ అవుతోన్న ‘ఉప్పెన’ టీజర్‌ కామెంట్‌… అసలు వంటలక్కకు ఉప్పెన సినిమాకు సంబంధమేంటి..

Uppena Teaser Comment Viral: మెగాహీరో సాయి ధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయమవుతూ 'ఉప్పెన' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే...

Uppena Teaser: వైరల్‌ అవుతోన్న 'ఉప్పెన' టీజర్‌ కామెంట్‌... అసలు వంటలక్కకు ఉప్పెన సినిమాకు సంబంధమేంటి..
Follow us

|

Updated on: Jan 14, 2021 | 5:33 AM

Uppena Teaser Comment Viral: మెగాహీరో సాయి ధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయమవుతూ ‘ఉప్పెన’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్‌లుక్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇక తాజాగా వైష్ణవ్‌ తేజ్‌ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్ర యూనిట్‌ ‘ఉప్పెన’ టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇదిలా ఉంటే ఈ టీజర్‌కు సంబంధించిన ఓ కామెంట్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఉప్పెన టీజర్‌కు ఓ నెటిజన్‌ కామెంట్‌ చేస్తూ.. ‘వంటలక్క మీద ఒట్టు ఈ సినిమా సూపర్‌ హిట్టు’ అని ఫన్నీగా కామెంట్‌ చేశాడు. ఇక ఈ కామెంట్‌ను ఏకంగా స్టార్‌ మా లైక్‌ చేసింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. సదరు కామెంట్‌ స్క్రీన్‌ షార్ట్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. ‘మా స్టార్‌ మా ఈ కామెంట్‌ని లైక్‌ చేసింది’ అంటూ క్యాప్షన్‌ జోడించింది. దీంతో ఈ కామెంట్‌ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ‘అసలు వంటలక్కకు… ఉప్పెన సినిమాకు సంబంధమేంటి’ అంటూ కొందరు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Esha Chawla : మరోసారి తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగుమ్మ..రెండు సినిమాలతో రానున్న ఇషాచావ్లా…