‘తలైవా’ ఆగమనం..దద్దరిల్లిన చిదంబరం స్టేడియం

మహేంద్రసింగ్‌ ధోనీ..ఈ నేమ్‌కి ఉన్న క్రేజ్ అంతా, ఇంతా కాదు. అతను ఎక్కడ అడుగుపెడితే అక్కడే అభిమానుల ప్రభంజనం మాములుగా ఉండదు. వీదేశాల్లోనూ ధోని ఫ్యాన్ బేస్ ఓ రేంజ్‌లో ఉంది. కానీ గత కొంతకాలంగా ధోని ఆటకు దూరంగా ఉన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌ ఓటమి తర్వాత అతడు.. గ్రౌండ్‌లో కనబడలేదు. అడపా దడపా.. బ్యాట్​ పట్టి నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. మార్చి 29న ఆరంభమయ్యే […]

'తలైవా' ఆగమనం..దద్దరిల్లిన చిదంబరం స్టేడియం
Follow us

|

Updated on: Mar 03, 2020 | 6:05 PM

మహేంద్రసింగ్‌ ధోనీ..ఈ నేమ్‌కి ఉన్న క్రేజ్ అంతా, ఇంతా కాదు. అతను ఎక్కడ అడుగుపెడితే అక్కడే అభిమానుల ప్రభంజనం మాములుగా ఉండదు. వీదేశాల్లోనూ ధోని ఫ్యాన్ బేస్ ఓ రేంజ్‌లో ఉంది. కానీ గత కొంతకాలంగా ధోని ఆటకు దూరంగా ఉన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌ ఓటమి తర్వాత అతడు.. గ్రౌండ్‌లో కనబడలేదు. అడపా దడపా.. బ్యాట్​ పట్టి నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. మార్చి 29న ఆరంభమయ్యే ఐపీఎల్‌ కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ మహీంద్రసింగ్ ధోని ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. సోమవారం చిదంబరం స్టేడియంలో, తమ జట్టు మరో ప్లేయర్ సురేశ్‌ రైనాతో కలిసి సాధన చేశాడు.

ధోని విమానాశ్రయంలో అడుగుపెట్టడం నుంచి హోటల్‌కు చేరడం, గ్రౌండ్‌లోకి అడుగుపెట్టడం.. వంటి విజువల్స్‌తో కూడిన వీడియోను సీఎస్‌కే ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహీ ఎక్కడికి వెళ్లినా అభిమానులు అరుపులు, కేకలు, చప్పట్లతో హోరెత్తించారు. కాగా ఈ నెల 29న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో రెండు టాప్ జట్లు…ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. మరోవైపు ఐపీఎల్‌లో ఒక జట్టుకు 10 సీజన్లుగా కెప్టెన్‌గా వ్యవహరించిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు ధోని. ఇకపోతే ఈ ఏఢాది అక్టోబర్​-నవంబర్​లో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఇందులో చోటు దక్కాలంటే ధోని భీకర ఫామ్‌తో రాణించాలి. మరి అభిమానుల ఆశలను ‘తలైవా’ ఎంతవరకు నెరవేరుస్తాడో చూడాలి.