ఏనుగు విషాద మ‌ర‌ణం..ఆ అధికారి వ్యాఖ్య‌ల‌పై దుమారం

కేర‌ళ‌లో ఏనుగు విషాద మ‌ర‌ణం దేశవ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఏనుగు మృతికి కార‌కులైన వారిని వెంట‌నే ప‌ట్టుకోని క‌ఠిన శిక్ష‌లు వేయాలంటూ సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర పోలీసు శాఖ కేసును సీరియ‌స్ గా తీసుకుని విచార‌ణ జ‌రుపుతోంది. తాజాగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దారుణ ఘ‌ట‌న‌కు బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అనుమానితుల్ని విచారిస్తున్నారని, న్యాయం గెలిచి తీరుతుందని కేరళ సీఎం పినరయి […]

ఏనుగు విషాద మ‌ర‌ణం..ఆ అధికారి వ్యాఖ్య‌ల‌పై దుమారం
Follow us

|

Updated on: Jun 05, 2020 | 6:59 AM

కేర‌ళ‌లో ఏనుగు విషాద మ‌ర‌ణం దేశవ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఏనుగు మృతికి కార‌కులైన వారిని వెంట‌నే ప‌ట్టుకోని క‌ఠిన శిక్ష‌లు వేయాలంటూ సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర పోలీసు శాఖ కేసును సీరియ‌స్ గా తీసుకుని విచార‌ణ జ‌రుపుతోంది. తాజాగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దారుణ ఘ‌ట‌న‌కు బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అనుమానితుల్ని విచారిస్తున్నారని, న్యాయం గెలిచి తీరుతుందని కేరళ సీఎం పినరయి విజయన్ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని సీఎం ట్వీట్ లో వివ‌రించారు. డిస్ట్రిక్ పోలీసు ఆఫిస‌ర్, అటవీ అధికారులు ఘటనా స్థలిని పరిశీలించి…అన్ని వివ‌రాలు సేక‌రించార‌ని వెల్లడించారు. దోషులను కఠిన శిక్ష‌లు అమ‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు. ఇలాంటి అమానవీయ ఘటనల వెనుక ఉన్న రీజ‌న్స్ ఏంట‌నేవి అన్వేషిస్తామని తెలిపిన సీఎం… కొంత మంది ఈ ఘటనను విద్వేషపూరిత ప్రచారానికి వినియోగించుకుంటుడం పట్ల ఫైర‌య్యారు.

మరోవైపు.. ఈ ఘటనపై కేరళ చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌, ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్‌ అధికారి సురేంద్ర కుమార్ కామెంట్స్ తీవ్ర చ‌ర్చ‌ల‌కు దారితీశాయి. ఇది కావాల‌ని చేసి ఉండకపోవచ్చని ఆయన త‌న అభిప్రాయం వెలిబుచ్చారు. అది అడవి ఏనుగు అని, ఎవరూ దాని వద్దకు వెళ్లే డేర్ చేయకపోవచ్చని తాను భావిస్తున్నట్లు తెలిపారు.