తిరుమల చరిత్రలోనే ఏకాంతంగా బ్రహోత్సవం

ఎప్పుడైనా అనుకున్నామా భక్తులు లేకుండా తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని... ఎప్పుడైనా ఊహించామా సందడి లేకుండా స్వామివారు వాహనాలపై విహరిస్తారని... గోవిందనామాల ప్రతిధ్వనులు, కోలాటాలు, సాంస్కృతిక కళారూపాలు, తిరుమాడ వీధుల్లో వేడుకలు ఇవేవీ లేకుండా బహ్మోత్సవాలు జరుగుతాయని కలలో కూడా అనుకోలేదు.

తిరుమల చరిత్రలోనే ఏకాంతంగా బ్రహోత్సవం
Follow us

|

Updated on: Sep 18, 2020 | 11:33 AM

ఎప్పుడైనా అనుకున్నామా భక్తులు లేకుండా తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని… ఎప్పుడైనా ఊహించామా సందడి లేకుండా స్వామివారు వాహనాలపై విహరిస్తారని… గోవిందనామాల ప్రతిధ్వనులు, కోలాటాలు, సాంస్కృతిక కళారూపాలు, తిరుమాడ వీధుల్లో వేడుకలు ఇవేవీ లేకుండా బహ్మోత్సవాలు జరుగుతాయని కలలో కూడా అనుకోలేదు.. కానీ కరోనా వైరస్‌ ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలపై కూడా ప్రభావం చూపింది.. అసలు భయంకరమైన విపత్తులు.. భీకరమైన ప్రపంచయుద్ధాలు జరిగిప్పుడు కూడా బ్రహ్మోత్సవాలు జనం తండోపతండాలుగా వచ్చారు.. ఈసారి మాత్రం ఆ సందళ్లను చూడలేము.. ఆగమోక్తంగా వైదిక క్రతువుల్లో ఎలాంటి తేడాలు లేకపోయినప్పటికీ ఆలయం వెలుపల మాత్రం కళ తగ్గింది..

అసలు బ్రహ్మోత్సవమంటేనే సందడి, సందోహం.. సప్తగిరులు శోభిల్లే వైభవం.. నానా దిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి అంటూ అన్నమయ్య వర్ణించినట్టుగానే అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఉత్సవాలను దర్శించి తరించడానికి తండోపతండాలుగా వచ్చే వైభోగం.. ఈసారి మాత్రం ఆల ఆవరణలోనే ఏకాంతంగా కలియుగ ప్రత్యక్షదైవమైన దేవదేవుడి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.. కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజు శ్రీ వేంకటేశ్వరస్వామి ఈ భూమిపై అవతరించారు. శ్రీవారి అవతరణ రోజున చక్రస్నానం నిర్వహిస్తారు..సరిగ్గా అందుకు తొమ్మిది రోజుల ముందు నుంచి జన్మదిన వేడుకలను సాక్షాత్తు మహా విష్ణువు పుత్రుడైన బ్రహ్మదేవుడు నిర్వహిస్తారు…అందుకే తిరుమల కొండలపై జరిగే ఈ ఉత్సవాలకు బహ్మోత్సవాలని పేరు వచ్చింది.

బ్రహ్మోత్సవాల అంకురార్పణ ఇవాళ సాయంత్రం జరగనుంది.. సేనాధిపతి విష్వక్సేనుడి పర్యవేక్షణలో ఈ క్రతువు జరుగుతుంది.. రేపటి నుంచి 27 వరకు వాహన సేవలు జరుగుతాయి. కాకపోతే మాడవీధుల్లో కాకుండా అంతరాలయంలోనే నిర్వహించబోతున్నారు.. మామూలుగా బ్రహ్మోత్సవాల వేళ స్వామి ఉదయం, సాయంత్రం ప్రధాన ప్రాకారం చుట్టూ నాలుగు మాడ వీధులలో వాహనాలపై విహరించేవారు.. భక్తులు ఆ దివ్య మోహన రూపాన్ని చూసి తరించిపోయేవారు.. . వాహనసేవ ముందు గజ తురగ వృషభ పదాతి దళాల కవాతు, కళాకారుల ప్రదర్శనలు, అర్చకుల మంత్రోచ్ఛరణ, పండితుల వేదఘోష ఇలా తిరుమల కొత్త శోభను సంతరించుకునేది.. ఈసారి మాత్రం స్వామివారు ఆనంద నిలయం చుట్టూ వెండివాకిలిలోనే ప్రదక్షిణ చేస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ వైభవాన్ని కళ్లారా చూసి పులకించేవారు.. ఇప్పుడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు.. అంటే 13 వేల మందికి మించరన్నమాట!

వాహన అలంకరణ వాహన మండపంలో కాకుండా కల్యాణ మండపంలో చేస్తారు. చక్రస్నానం కూడా స్వామి పుష్కరిణిలో కాకుండా ఆయాన్‌ మండంలోనే గంగాళంలో పవిత్ర జలాలను ఆవాహనం చేసి చక్రస్నానం చేయించనున్నారు.. భక్తుల సందడి లేకపోతేనేం.. తిరుమలలో ఎప్పుడూ పండుగ వాతావరణమే.. నిత్యకళ్యాణము.. పచ్చతోరణమే.. వచ్చే బ్రహ్మోత్సవాలనాటికి ఈ కరోనా పీడ తొలగిపోవాలని… వేంకటేశ్వరుడికి జరిగే బ్రహ్మోత్సవాలకు కనులారా తిలకించి…భక్తి పారవశ్యంతో పునీతులమవ్వాలని…తిరుమలేశుడి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులమవ్వాలని సాక్షాత్తూ ఆ స్వామివారినే వేడుకుందాం!

Latest Articles
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
ఏటీఎం నుంచి డబ్బు రాకుండా మీ అకౌంట్ నుంచి కట్ అయ్యాయా..?
ఏటీఎం నుంచి డబ్బు రాకుండా మీ అకౌంట్ నుంచి కట్ అయ్యాయా..?
పేరెంట్స్‌ చేసే ఈ తప్పుల వల్లే.. చిన్నారుల్లో మధుమేహం..
పేరెంట్స్‌ చేసే ఈ తప్పుల వల్లే.. చిన్నారుల్లో మధుమేహం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
8 రోజుల ముందే టికెట్స్ బుక్ చేస్తే.. ఆ ఛార్జీలు ఉండవ్..
8 రోజుల ముందే టికెట్స్ బుక్ చేస్తే.. ఆ ఛార్జీలు ఉండవ్..
టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే.. తేల్చి చెప్పిన పాక్
టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే.. తేల్చి చెప్పిన పాక్
ఇంత భారీ తగ్గింపులను ఎప్పుడూ చూసుండరు.. ఏకంగా 80 శాతం వరకూ..
ఇంత భారీ తగ్గింపులను ఎప్పుడూ చూసుండరు.. ఏకంగా 80 శాతం వరకూ..
వేసవిలో యూరప్ టూర్ వెళ్తున్నారా..? ఆ కొత్త వీసాతో లాభాలెన్నో..!
వేసవిలో యూరప్ టూర్ వెళ్తున్నారా..? ఆ కొత్త వీసాతో లాభాలెన్నో..!
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి