Tarakaratna: తారకరత్న పిల్లలతో బాలయ్య, మోక్షజ్ఞ.. ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య..

ఈ క్రమంలోనే తాజాగా తన కుమారుడు మోక్షజ్ఞతో కలిసి తారకరత్న కుటుంబాన్ని మరోసారి కలుసుకున్నాడు బాలయ్య. ఇందుకు సంబంధించిన ఫోటోలను తారకరత్న సతీమణి అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో బాలయ్య, మోక్షజ్ఞతోపాటు.. తారకరత్న భార్య అలేఖ్య, పిల్లలు కనిపిస్తున్నారు. ఈ ఫోటోను పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అలేఖ్య.

Tarakaratna: తారకరత్న పిల్లలతో బాలయ్య, మోక్షజ్ఞ.. ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య..
Balakrishna
Follow us

|

Updated on: Apr 20, 2024 | 1:34 PM

నందమూరి తారకరత్న గతేడాది గుండెపోటుతో మరణించిన తర్వాత ఆయన కుటుంబ బాధ్యతలను హీరో బాలకృష్ణ తీసుకున్న సంగతి తెలిసిందే. నిత్యం వారి బాగోగులలు చూసుకుంటూ ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. తారకరత్న కుటుంబాన్ని కలుస్తూ వారికి తాను ఉన్నానన్న ధైర్యాన్ని ఇస్తున్నారు. అలాగే అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి తారకరత్న పిల్లలను కలుస్తూ వారితో కాసేపు సరదాగా గడుపుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన కుమారుడు మోక్షజ్ఞతో కలిసి తారకరత్న కుటుంబాన్ని మరోసారి కలుసుకున్నాడు బాలయ్య. ఇందుకు సంబంధించిన ఫోటోలను తారకరత్న సతీమణి అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో బాలయ్య, మోక్షజ్ఞతోపాటు.. తారకరత్న భార్య అలేఖ్య, పిల్లలు కనిపిస్తున్నారు. ఈ ఫోటోను పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అలేఖ్య.

“నేను ఎటు వైపు ఉన్నానని ఎప్పుడూ నన్ను అడుగుతున్నారు. మానవత్వం, ప్రేమ, ముఖ్యంగా నా కుటుంబం వైపు ఉన్నాను. మావయ్య (బాలయ్య) మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓబు, పిల్లలు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాము” అంటూ రాసుకోచ్చారు. ప్రస్తుతం అలేఖ్య చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఓవైపు ఏపీలో ఎలక్షన్స్ హడావిడి ఉండగా.. ఇప్పుడు అలేఖ్య చేసిన పోస్ట్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందంటున్నారు నెటిజన్స్. అలాగే పోస్ట్ పై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ.. బాలయ్య మనసు బంగారం.. ఎప్పటికీ మిమ్మల్ని బాగా చూసుకుంటారు.. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తారకరత్న మరణం తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు అలేఖ్య. ఎప్పుడూ తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటారు. అలాగే తారకరత్నతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్స్ చేస్తుంటారు. అలాగే అటు నందమూరి బాలకృష్ణ, ఇటు విజయసాయిరెడ్డితో దిగిన ఫోటోలను కూడా పంచుకుంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.