Astrology: సింహ రాశి మీద ఐదు గ్రహాల ప్రభావం.. ఆ రాశుల వారికి అత్యధిక ప్రయోజనాలు..!

ఈ నెల 16 నుంచి సుమారు నెల రోజుల పాటు సింహ రాశి మీద గ్రహాల దృష్టి, ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతోంది. ఈ రాశిలో 16 నుంచి రాశ్యధిపతి రవి సంచారం చేయడం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఈ రాశిలో శుక్ర, బుధుల సంచారం జరుగుతుండగా, కుజ, శనుల దృష్టి కూడా దీని మీద పడింది. మొత్తానికి అయిదు గ్రహాల ప్రభావం సింహ రాశి మీద ఉన్నందువల్ల ఈ రాశి అనుకూలంగా..

Astrology: సింహ రాశి మీద ఐదు గ్రహాల ప్రభావం.. ఆ రాశుల వారికి అత్యధిక ప్రయోజనాలు..!
Astrology
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 11, 2024 | 10:13 PM

ఈ నెల 16 నుంచి సుమారు నెల రోజుల పాటు సింహ రాశి మీద గ్రహాల దృష్టి, ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతోంది. ఈ రాశిలో 16 నుంచి రాశ్యధిపతి రవి సంచారం చేయడం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఈ రాశిలో శుక్ర, బుధుల సంచారం జరుగుతుండగా, కుజ, శనుల దృష్టి కూడా దీని మీద పడింది. మొత్తానికి అయిదు గ్రహాల ప్రభావం సింహ రాశి మీద ఉన్నందువల్ల ఈ రాశి అనుకూలంగా ఉన్న రాశుల వారికి అనేక అనుకూల ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, ధనూ రాశుల వారు ఈ అయిదు గ్రహాల కాంబినేషన్ వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందుబోతున్నారు.

  1. మేషం: ఈ రాశికి అత్యంత శుభప్రదమైన సింహ రాశిపై రాశ్యధిపతి కుజుడితో సహా అయిదు గ్రహాల ప్రభావం పడుతున్నందువల్ల ఒక నెల రోజుల పాటు జీవితం యోగదాయకంగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అన్ని విషయాల్లోనూ కనీ వినీ ఎరుగని లాభాలందుకుంటారు. మీ ఆలోచనలు, మీ కార్యక్రమాలన్నీ సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో సానుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఊహించని ప్రాధాన్యం ఏర్పడే అవకాశం ఉంది.
  2. వృషభం: ఈ రాశికి నాలుగవ స్థానమైన సింహ రాశి మీద శుభ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. గృహ, వాహన సౌకర్యాలు అమరు తాయి. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. మాతృ సౌఖ్యం కలుగుతుంది. ఉద్యోగ జీవితం రాజయోగంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృధ్ధి బాట పడతాయి. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి ధన స్థానం మీద అత్యధిక సంఖ్యలో గ్రహాల ప్రభావం పడినందువల్ల ధన సంపాదన మార్గాలు విజయవంతం అవుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమై మానసిక ఊరట కలుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. మీ వల్ల అధి కారులు లేదా సంస్థ బాగా లాభపడడం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది.
  4. సింహం: అయిదు శుభ గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశివారి జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది. ఊహిం చని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ రంగంలో ఉన్నా, ఏ సంస్థలో పని చేస్తున్నా అవి తప్పకుండా వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశీ పర్యటనలు చేయ వలసి వస్తుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. సంపన్నుల సర్కిల్ లో చేరడం జరుగు తుంది. రాజకీయంగా కూడా ప్రాబల్యం కలుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.
  5. తుల: ఈ రాశికి లాభస్థానమైన సింహ రాశి మీద గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పాటు, రాశ్య ధిపతి కూడా లాభస్థానంలోనే ఉండడం వల్ల కొద్ది రోజుల పాటు జీవితం వైభవంగా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఉన్నతస్థాయి పరిచయాలు ఏర్పడతాయి. మీ సలహాలు, సూచన లకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  6. ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానమైన సింహం మీద గ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల అనేక విధాలుగా భాగ్యం కలిసి వస్తుంది. పిత్రార్జితం సంక్రమిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. విదేశీ సొమ్మును అనుభవించే యోగం పడుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు అంచనాలకు మించిన ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది. జీవనశైలి మారిపోతుంది. అనేక శుభవార్తలు వింటారు.

రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
అమెజాన్‌లో ఆ హోమ్ థియేటర్లపై బంపర్ ఆఫర్లు.. తగ్గింపు ఎంతంటే..?
అమెజాన్‌లో ఆ హోమ్ థియేటర్లపై బంపర్ ఆఫర్లు.. తగ్గింపు ఎంతంటే..?
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
సింహ రాశి మీద ఐదు గ్రహాల ప్రభావం..ఆ రాశుల వారికి అత్యధిక ప్రయోజనం
సింహ రాశి మీద ఐదు గ్రహాల ప్రభావం..ఆ రాశుల వారికి అత్యధిక ప్రయోజనం
ఐపీఎల్ వేలం తర్వాత ఆటగాళ్లకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా?
ఐపీఎల్ వేలం తర్వాత ఆటగాళ్లకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా?
గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. ఆ పని చేయాల్సిందే..!
గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. ఆ పని చేయాల్సిందే..!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
అలా డ్రైవ్ చేసే వారికి.. ట్రాఫిక్‌ కెమెరా చూస్తోంది. జైలు తప్పదు!
అలా డ్రైవ్ చేసే వారికి.. ట్రాఫిక్‌ కెమెరా చూస్తోంది. జైలు తప్పదు!
ఎల్లోరా శిల్పం‌లా ఫోజులిచ్చిన హనీ రోజ్..
ఎల్లోరా శిల్పం‌లా ఫోజులిచ్చిన హనీ రోజ్..