అమ్మో..! 24 గంటల్లో 3 రైళ్లను టార్గెట్ చేసిన దొంగలు.. ప్రయాణికులు హడల్..

అర్ధరాత్రి 2గంటల 30 నిమిషాలు అయింది. చెన్నై నుండి హైదరాబాద్ వెళుతున్న రైలు.. తుమ్మల చెరువు సిగ్నల్ వద్ద ఆగింది. రైలు తిరిగి బయలు దేరగానే చెయిన్ లాగడంతో ఆగిపోయింది. వెంటనే తిరిగి బయలు దేరగానే మరోసారి చెయిన్ లాగారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది రైల్వే కోచ్‎ల తలుపులు మూసివేసే ప్రయత్నం చేశారు.

అమ్మో..! 24 గంటల్లో 3 రైళ్లను టార్గెట్ చేసిన దొంగలు.. ప్రయాణికులు హడల్..
Guntur
Follow us

| Edited By: Srikar T

Updated on: Aug 11, 2024 | 4:04 PM

అర్ధరాత్రి 2గంటల 30 నిమిషాలు అయింది. చెన్నై నుండి హైదరాబాద్ వెళుతున్న రైలు.. తుమ్మల చెరువు సిగ్నల్ వద్ద ఆగింది. రైలు తిరిగి బయలు దేరగానే చెయిన్ లాగడంతో ఆగిపోయింది. వెంటనే తిరిగి బయలు దేరగానే మరోసారి చెయిన్ లాగారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది రైల్వే కోచ్‎ల తలుపులు మూసివేసే ప్రయత్నం చేశారు. సరిగ్గా అదే సమయంలో నలుగురైదుగురు దొంగలు ఎస్ 4, ఎస్ 8, ఎస్ 10, ఎస్ 12 కోచ్‎ల్లో విండో పక్కన సీట్లతో ఉన్న వారి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కొని వెళ్లారు. అయితే చెయిన్ పదే పదే లాగడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే బండిని అక్కడ నుండి ముందుకు తీసుకెళ్లారు.

సరిగ్గా ఈ ఘటన జరిగిన సమయానికి కొద్దీ దూరంలోని డెల్టా ఎక్స్ ప్రెస్‎లోని ఎస్ 9 కోచ్‎లో కూడా దొంగలు బంగారు ఆభరణాలు తెంపుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒకే సయమంలో రెండు ఘటనలు జరగడం కలకలం రేపింది. దీంతో గుంటూరు డివిజన్ నుండి పోలీస్ బలగాలు వెళ్లి ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ రెండు ఘటనలు జరిగి 24 గంటలు కాకముందే నర్సాపూర్ ఎక్స్ ప్రెస్‎ను నిలిపి ప్రయాణీకుల వద్ద నుండి బంగారు ఆభరణాలను దోచుకునే ప్రయత్నం చేశారు దొంగలు. రాత్రి 1.30 గంటల సమయంలో నడికుడి వద్ద ట్రెయిన్ చెయిన్ లాగి నిలిపి వేశారు. అయితే అప్పటికే ట్రెయిన్ కోచ్ ల్లోని డోర్స్ క్లోజ్ చేయడంతో పాటు పోలీసులు అప్రమత్తంగా ఉండి విండోలను క్లోజ్ చేయించారు. దీంతో ట్రెయిన్ ఆగిన దగ్గరకు వచ్చిన దొంగలు ప్రయాణీకులను దోచుకునే అవకాశం లేకపోవడంతో వెంటనే రైలుపై రాళ్లు రువ్వారు. తేరుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రెయిన్ అక్కడ నుండి ముందుకు పోనిచ్చారు. అయితే ఈ రైలులో ప్రయాణిస్తున్న వారెవరూ తమ బంగారు ఆభరణాలు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

ఇలా 24 గంటల వ్యవధిలో మూడు రైళ్లలో దొంగతనాలు జరగటంతో రైల్వే అధికారులు ఖంగుతిన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తుకు ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే రానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది రైళ్లలో తక్కువుగా ఉంటారని తెలుసుకున్న వ్యక్తులే ఇలా చెయిన్ లాగి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత
దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత
సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్
సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్
చైతూ- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయట పెట్టేసిన సమంత
చైతూ- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయట పెట్టేసిన సమంత
కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?
కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..