వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ధివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైన వైఎస్ జగన్.. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి. వైఎస్ జగన్ 1972 డిసెంబర్ 21న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. ఆయన బీ.కామ్, ఎంబీఏ చదువుకున్నారు. 1996లో భారతిని జగన్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పారిశ్రామిక వేత్తగా కెరీర్ ప్రారంభించిన జగన్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై కడప ఎంపీగా గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో జగన్ సాధించిన తొలి విజయం ఇదే. అదే సంవత్సరం హెలికాప్టర్ ప్రమాదంలో తండ్రి వైఎస్సార్ మరణించడంతో జగన్ జీవితంలో పెను కుదుపు ఏర్పడింది. వైఎస్సార్ మరణం తర్వాత ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలకు జగన్ దగ్గరయ్యారు. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్ర ద్వారా పరామర్శించారు.

కాంగ్రెస్ పార్టీతో విబేధాల కారణంగా.. 2010లో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట కొత్త పార్టీని ప్రారంభించారు. 2011లో కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచారు. తండ్రి పరపతిని వాడుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ చేత అరెస్టైన జగన్.. 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జగన్.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు 2017లో ప్రజాసంకల్ప యాత్రను చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో 151 స్థానాల్లో గెలిచి ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

ఇంకా చదవండి

AP Elections 2024: ‘మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు’.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మూడు నియోజవర్గాల్లో పర్యటించారు సీఎం జగన్. నరసాపురం, పెదకూరపాడు, కనిగిరి నియోజకర్గాల్లో సీఎం జగన్ రోడ్ షోలకు జనాలు పోటెత్తారు. పెన్షన్ కోసం వృద్దులు పడుతున్న కష్టం చూసి ఒక్క నెల ఓపిక పట్టండి.. మీ బిడ్డ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతానన్నారు సీఎం జగన్. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే వచ్చి పెన్షన్‌ ఇస్తారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 9:27 pm

Watch Video: వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన.. చంద్రబాబుకు చురకలు..

పులివెందులలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ప్రతిరోజూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకించి మహిళలను ఆకట్టుకునే పనిలో ఉన్నారామె. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల బాధలు తెలుసుకుంటున్నారు. పెన్షనర్ల అవస్థలు మళ్లీ జగన్ వస్తేనే తగ్గుతాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తనపాలనపై ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 6:24 pm

Watch Video: ‘చంద్రబాబు సూపర్6 అంతా మోసం’.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్..

ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయన్నారు సీఎం జగన్. ఒకసారి అవకాశమిస్తే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న సీఎం.. లంచాలు, వివక్ష లేకుండా పథకాలు ఇంటి వద్దకే అందజేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూర్ సెంటర్‌లో సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ మీటింగ్‎కు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం జగన్. 2014లో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 4:28 pm

CM YS Jagan: వైసీపీ త్రిశూల వ్యూహం.. గెలుపు కోసం అభ్యర్థుల ప్రచారం.. వాళ్ల కోసం జగన్ ప్రచారం

రెండోసారి అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ దూకుడుగా వెళ్తోంది. అభ్యర్థులు తమ గెలుపు కోసం వాళ్లు కష్టపడుతున్నారు. వాళ్లను గెలిపించడం కోసం అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నారు. జగన్‌ కోసం తాము సైతం అంటూ కొత్తగా వీళ్లు రంగంలోకి దిగారు.

Watch Video: సీఎం జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని రాంభూపాల్ రెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సిరీయస్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు సీఎం జగన్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకులు కౌంటర్ దాడి చేస్తున్నారు. సీఎం జగన్‎పై చంద్రబాబు నోరు పారేసుకుంటే తగిన బుద్ధి చెప్తాం అని హెచ్చరించారు. వయసుకు తగ్గట్లు, రాజకీయ అనుభవానికి తగినట్లుగా చంద్రబాబు మాట్లాడకుండా హింసను ప్రేరేపించేలా రెచ్చగొడుతూ నేరానికి పాల్పడుతున్నారన్నారు.

ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు.. రాముడు, రావణుడు అంటూ ప్రచారం..

నెల్లూరు జిల్లా కావలి ఎన్నికల ప్రచారంలో రాముడు, రావణుడు అంటూ మాటల తూటలు పేలుతున్నాయి. వైసీపీ, టీడీపీతోపాటు టీడీపీ నుండి టికెట్టు ఆశించి భంగపడ్డ పసుపులేటి సుధాకర్ ఇండిపెండెంట్‎గా బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రౌడీ అంటూ టీడీపీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు.

CM Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదంపై సీఎం జగన్ రియాక్షన్ ఇదే

పేదలకు మంచి జరిగేందుకు సంక్షేమ పథకాలు, అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదిగేందుకు సామాజిక న్యాయం పాటిస్తూ 59 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. తన పాలనలో రైతుల పంటలకు ఎంఎస్పీకి మించిన ధర అందుతుందన్నారు. బొబ్బిలి, పాయకరావు పేట, ఏలూరు సభలో ప్రసంగించిన సీఎం జగన్‌.. సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరోసారి అధికారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

AP Politics: భూమి చుట్టూ ఏపీ రాజకీయం.. ఎన్నికల వేళ లాండ్‌ టైట్లింగ్‌ యాక్టు రచ్చ

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ హాట్ టాపిక్‌గా మారింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ చట్టం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ తొలిసారిగా ఈ వివాదంపై స్పందించారు.

ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకే ఎంఐఎం మద్ధతు.. చంద్రబాబుపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయాలపై స్పందించారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని ఎంఐఎం అధినేత ఓటర్లను కోరారు. ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత అసద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

  • Srikar T
  • Updated on: May 1, 2024
  • 5:29 pm

YS Jagan: ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష.. సూపర్‌ సిక్స్‌ను నమ్మొచ్చా.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..

జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.. లంచాలు, వివక్ష లేని పాలన అందించాం.. చంపితే ఏమవుతుంది అంటూ.. చెడు చేయాలని కొందరు కోరుకుంటున్నారు.. ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష.. అంటూ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అన్నారు.

YS Jagan: ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్.. ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటన

58 నెలల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై వివరణ.. చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలను పదే పదే ప్రస్తావిస్తూ సాగుతోంది సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించిన జగన్.. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి మరోసారి ఓటు వేయాలని కోరుతున్నారు.

YS Jagan: చంద్రబాబుకు ఫోన్‌ వచ్చింది.. అందుకే మోదీ ఫొటో పెట్టలేదు.. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్ఠానం చంద్రబాబుకు ఫోన్‌ చేసింది.. మేనిఫెస్టోలో మీ ఫొటోలు పెట్టుకోండి.. మోదీ ఫొటో పెడితే ఒప్పుకోబోమని చెప్పినట్టుంది .. అందుకే ఫొటో పెట్టలేదంటూ సీఎం జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు హామీలు మోసమే అని తేలిపోయింది.. కూటమిలోని ముగ్గురి ఫొటోలు పెట్టుకునే పరిస్థితిలేదు.. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు బరితెగించారు అంటూ ఫైర్ అయ్యారు.

CM YS Jagan: జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. సీఎం జగన్ సుడిగాలి పర్యటన.. ఇవాళ ఎక్కడెక్కడంటే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన కొనసాగిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకు మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ మళ్లీ అధికారం ఇస్తే, వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో చెబుతూ ముందుకు సాగుతున్నారు.

YSRCP: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం జగన్.. సుడిగాలి పర్యటనలతో క్యాడర్‏లో జోష్..

సిద్ధం.. మేమంతా సిద్ధం బస్సుయాత్రల తర్వాత మలివిడత ప్రచారం మొదలుపెట్టిన సీఎం జగన్‌.. ఇవాళ మూడు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా అనకాపల్లిజిల్లా చోడవరం నియోజకవర్గంలోని కొత్తూరు జంక్షన్‌ దగ్గర జరిగిన సభలో పాల్గొన్న జగన్‌.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రజలు చంద్రబాబును నమ్మడం అంటే.. కొండచిలువ నోట్లో తలపెట్టడమేనన్నారు. చంద్రబాబును నమ్మితే అంతా గోవిందా.. గోవిందా అంటూ జనంలో జోష్‌ పెంచారు సీఎం జగన్‌.

  • Srikar T
  • Updated on: Apr 29, 2024
  • 9:51 pm

షర్మిల, చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే..

చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుట్రలో తన సోదరి వైఎస్ షర్మిల భాగస్వామ్యం అయ్యారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఓ జాతీయ ఛానల్‎కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సోదరి వైఎస్ షర్మిలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టిన వాళ్ళలో చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ అందని.. అదే పార్టీలో వైఎస్ షర్మిల చేరడం, పోటీ చేయడం తనకు బాధ కలిగించదన్నారు. షర్మిల పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కవని షర్మిల ఎలాగు ఓడిపోతుందన్నారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?