Little Boy Tallent: పనికిరాని వస్తువులతోడ్రమ్స్‌ వాయిస్తున్న చిన్నారి.. శివమణిని మించిపోయాడుగా..!

|

Dec 22, 2022 | 8:49 AM

ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్‌ దాగి ఉంటుంది. అది ఏదొక సమయంలో ఏదోక రూపంలో బయటపడుతుంది. అలాంటి ఎందరో మట్టిమాణిక్యాల్లా మిగిలిపోతున్నారు. అయితే

ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్‌ దాగి ఉంటుంది. అది ఏదొక సమయంలో ఏదోక రూపంలో బయటపడుతుంది. అలాంటి ఎందరో మట్టిమాణిక్యాల్లా మిగిలిపోతున్నారు. అయితే ఇటీవల సోషల్‌ మీడియా పుణ్యమా అని ఎందరో ఇలాంటి ట్యాలెంటెడ్ పర్సన్స్‌ వెలుగులోకి వచ్చారు. తాజాగా ఓ చిన్నారి ఎంతో అద్భుతంగా డ్రమ్స్‌ వాయిస్తున్న వీడియో నెట్టింట దూసుకుపోతోంది. అదికూడా ఆ చిన్నారి ఎలాంటి మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ లేకుండా తనకు అందుబాటులో ఉన్న నిరుపయోగమైన వస్తువులతో తనలోని ట్యాలెంట్‌కు పదును పెడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిన్నారి ప్రతిభకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి ఓ ప్లాస్టిక్‌ డబ్బాను చైర్‌గా ఏర్పాటు చేసుకుని కూర్చున్నాడు. అతనికి చుట్టూ కొన్ని కర్రలు పాతిపెట్టాడు. వాటికి ఓ వైపు కర్రలకు రెండు ఇనుప రేకులను అమర్చాడు. ఎదురుగా ఉన్న మూడు కర్రలకు రెండు గిన్నెలు, ఓ ప్లాస్టిక్‌ డబ్బాను అమర్చాడు. వాటినే తన మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌గా వాడుతూ అద్భుతంగా డ్రమ్స్‌ వాయిస్తున్నాడు. ఆచిన్నారి అలా వాయిస్తుంటే ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ శివమణిని మించిపోయాడనిపిస్తోంది. జిజన్‌ టాంగ్‌ అనే యూజర్‌ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. కాగా ఈ వీడియోను 4 కోట్లమందికి పైగా వీక్షించారు. లక్షల్లో లైక్‌ చేస్తున్నారు. ఈ వీడియోపై పలువురు రకరకాలుగా స్పందించారు. ప్రపంచంలో అద్భుతమైన నైపుణ్యాలు ఎన్నో ఇంకా అడవికాచిన వెన్నెలగానే మిగిలిపోతున్నాయంటున్నారు. మరో యూజర్‌ ఈ చిన్నారికి ఎవరైనా డ్రమ్‌ సెట్‌ సమకూర్చమంటూ కోరాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 22, 2022 08:49 AM