Vitamin B12: మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అయితే.. శాఖాహారులు తరచుగా ఎదుర్కొనే ప్రధాన సమస్య విటమిన్ బి12 లోపం. ఈ విటమిన్ లోపం ఉంటే.. కొన్ని స్పష్టమైన లక్షణాలు రూపంలో బయట పడుతూ ఉంటుంది. వాటిని గమనిస్తూ వైద్యుల సూచన మేరకు విటమిన్ బి 12ను భర్తీ చేస్తూ ఉండాలి.
విటమిన్ బి 12 లోపం తలెత్తిన తొలి రోజుల్లో.. చేతుల్లో, పాదాల్లో సూదులతో పొడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్రమైన లక్షణానికి కారణం బి 12 లోపం. ఈ లోపం కారణంగా నాడీ కణాలు సమర్థంగా పని చేయకపోవచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే నాడులకు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చేతుల్లో, పాదాల్లో సూదులతో గుచ్చుతున్నట్టు అనిపించినా మంటగా అనిపించినా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.
విటమిన్ బి12 తగ్గితే రక్తంలో ఆక్సిజన్ మోతాదు కూడా తగ్గుతుంది. దీంతో రక్తాన్ని సరఫరా చేయడం కోసం గుండె అవసరానికి మించి కష్టపడాల్సి వస్తుంది. ఈ కారణంగా గుండె దడ పెరుగుతుంది. అకస్మాత్తుగా గుండె వేగంగా కొట్టుకుంటున్నా, గుండె వేగంలో హెచ్చుతగ్గులు గమనించినా బి-12 లోపం ఉందని గమనించాలి. బి 12 లోపంతో బాధపడే వ్యక్తుల చర్మం పాలిపోయి జీవం కోల్పోతుంది. దీనికి కారణం ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గడమే. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి బి12 దోహదపడుతుంది. ఈ విటమిన్ లోపిస్తే రక్తహీనత తలెత్తి, చర్మం పాలిపోతుంది. దాంతో చర్మం లేత పసుపు రంగులోకి మారుతుంది. ఇలా చర్మం రంగు మారితే విటమిన్ బి 12 లోపం ఉందని గ్రహించాలి.
బి12 విటమిన్ లోపం ఉంటే నోటిలో అల్సర్లు, పుండ్లు ఏర్పడతాయి.. అంతేకాకుండా నోట్లో తరచూ పుండ్లు ఏర్పడుతూ.. అవి తగ్గడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. ఇలా పెదవులు నోటి లోపల పుండ్లు వస్తూ ఉంటే విటమిన్ బి12 లోపం ఉందని అర్థం చేసుకోవాలి. రక్తంలో ఆక్సిజన్ మోతాదు తగ్గడం వల్ల చర్మంలోని రక్తనాళాలకు సరిపడా ఆక్సిజన్ అందక.. చలి పెరుగుతుంది. ఇతరులకు సౌకర్యంగా ఉన్నా.. మీరు అసౌకర్యానికి గురవుతుంటే.. విటమిన్ బి12 లోపంగా భావించాలి. చల్లదనాన్ని తట్టుకోలేకపోవడం బి12 లోపంలో కనిపించే మరొక లక్షణం. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.