కొబ్బరి బోండంలో అద్భుత రూపం కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకులు ఇల్లెందుల పర్రులో ఆశ్చర్యకరంగా వినాయకుడు రూపం కొబ్బరి బోండంలో కనిపించింది. పసల భాస్కరరావు తన పొలంలోని కొబ్బరి చెట్ల నుండి కాయలు తీస్తుండగా ఒక చెట్టు నుండి తీసిన కొబ్బరికాయల్లో వినాయకుని ఆకారం పోలిన బొండాం కనిపించింది.