వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్తో పాటు విజయసాయిరెడ్డికి పంపినట్లు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా జగన్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.