కిలో టమోటా ఒక రూపాయి. అవును.. జస్ట్ రూపాయి మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ రైతులకు మాత్రమే! రేటు పెరిగినప్పుడల్లా వినియోగదారులను, రేటు తగ్గితే రైతులను కంట తడి పెట్టిస్తోంది టమోటా. దాని రేటు పెరిగినా తగ్గినా బాగుపడుతోంది మాత్రం దళారులే. కర్నూలు పత్తికొండ మార్కెట్లో టమోటాలను రైతులు పారబోసి వెళ్లిపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.