Fire accident: భద్రాద్రి పాల్వంచలో అగ్ని ప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు.. ( వీడియో )

|

Jun 16, 2021 | 9:52 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు చెలగేగుతుండటంతో విద్యుత్ సిబ్బంది విద్యుత్‌ను నిలిపివేశారు. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సబ్ స్టేషన్ అగ్ని ప్రమాదం సంభవించడంతో చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.విద్యుత్ కండక్టర్ వైరు తెగి ట్రాన్స్ఫార్మర్ మీదపడటంతో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు సబ్‌ స్టేషన్‌ మొత్తం విస్తరించడంతో ఇప్పటికే సబ్ స్టేషన్ సగానికిపైగా అగ్నికి ఆహుతైంది. పాల్వంచ కేటీపీఎస్ నుంచి 3 కొత్తగూడెం నుంచి 1 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కూడా వ్యాపించడంతో అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: విదేశాల్లో ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకున్న మన టాలీవుడ్ హీరోయిన్లు. వీరే.. ( వీడియో )

Viral Video: కొత్త కోడలికి ప్రతి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌..!! వైరల్ అవుతున్న వీడియో..

Follow us on