Watch Video: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్‌, నయన తార.. షారుఖ్‌ దైవ భక్తికి ఫ్యాన్స్ ఫిదా

| Edited By: Rajeev Rayala

Sep 05, 2023 | 12:19 PM

నయనతారతో పాటు భర్త విఘ్నేష్‌ కూడా శ్రీవారిని సందర్శించుకున్నారు. తెల్లవారు జామున సుప్రభాత సేత సేవలో కుమార్తె సుహానా ఖాన్‌, హీరోయిన్‌ నయనతారతో కలిసి తిరుమలేశుడి సేవలో షారుఖ్‌ తరించారు. షారుఖ్‌ నటించిన తాజా చిత్రం జవాన్‌ సెప్టెంబ్‌ 7వ తేదీన విడుదలవుతోన్న విషయం తెలిసిందే. సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్‌ శ్రీవారిని...

బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నటి నయన తారతో కలిసి మంగళవారం ఉదయం తిరుమల వెంకన్న సేవలో షారుఖ్‌ పాల్గొన్నారు. షారుఖ్‌ కూతురు కూడా తిరుమల వచ్చారు. ఇక నయనతారతో పాటు భర్త విఘ్నేష్‌ కూడా శ్రీవారిని సందర్శించుకున్నారు. తెల్లవారు జామున సుప్రభాత సేత సేవలో కుమార్తె సుహానా ఖాన్‌, హీరోయిన్‌ నయనతారతో కలిసి తిరుమలేశుడి సేవలో షారుఖ్‌ తరించారు. దర్శనానికి ముందు పద్మావతి గెస్ట్ హౌస్ లో నాన్ హిందూ డిక్లరేషన్ పై షారుఖ్, ఆయన తనయ సుహానా సంతకాలు చేశారు. షారుఖ్‌ నటించిన తాజా చిత్రం జవాన్‌ సెప్టెంబ్‌ 7వ తేదీన విడుదలవుతోన్న విషయం తెలిసిందే. సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత షారుఖ్‌ ధ్వజా స్థంభానికి తల ఆనించి ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. షారుఖ్‌ దైవ భక్తి చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Published on: Sep 05, 2023 08:23 AM