సంధ్య థియేటర్ ఘటనలో ప్రధాన నిందితుడు అరెస్ట్
సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించి అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 4న పుష్ప2 ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా ఆంటోని అని.. పేర్కొంటున్నారు పోలీసులు.
ఈ క్రమంలోనే.. అల్లు అర్జున్ బౌన్సర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక విచారణ అనంతరం అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనిని సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్‌కి తీసుకెళ్లనున్నారు చిక్కడపల్లి పోలీసులు. అసలు సంధ్య థియేటర్‌లో ఆ రోజు ఏం జరిగింది? అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఎక్కడ కూర్చున్నారు..? తొక్కిసలాట ఎక్కడ జరిగింది..? కారణాలు ఏంటి..? ఆ సమయంలో బౌన్సర్లు ఏం చేశారు.. రేవతి మరణానికి కారణం ఏంటి..? అనే విషయాలపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.. పోలీసులు.. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆంటోనీతో సహా వారితో కలిసి విచారణ నిర్వహించనున్నారు.ఇక సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు 18 మందిపై కేసు నమోదు చేశారు.. ఇప్పటికే.. ఈ కేసులో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది.. సుమారు మూడున్నర గంటల పాటు విచారణ కొనసాగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: అల్లు అర్జున్‌కు నెట్టింట పెరుగుతున్న సానుభూతి
దట్టమైన మంచులోనూ రైళ్లు దూసుకుపోయే టెక్నాలజీ !!
8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు..
అరటి పండ్ల బండిని చూసి పారిపోతున్న కోతులు.. ఏం జరిగిందంటే ??
ఉలవలు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయా ?? రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయా ??