ఛత్తీస్‌గఢ్ లోక్‌ సభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు - Chhattisgarh Lok Sabha Election Constituencies Wise Result

ఛత్తీస్‌గఢ్‌ మధ్య భారతదేశంలోని ఒక రాష్ట్రం. ఛత్తీస్‌గఢ్‌ను 'రైస్ బౌల్' అని పిలుస్తారు. 24 సంవత్సరాల క్రితం ఛత్తీస్‌గఢ్ కొత్త రాష్ట్రంగా అవతరించింది. నవంబర్ 1, 2000న మధ్యప్రదేశ్ నుండి విడిపోయి ఛత్తీస్‌గఢ్ కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయబడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ జనాభా 2.55 కోట్లు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అంటే.. 2000 సంవత్సరం నుంచి 2018 వరకు బిజెపి పార్టీకి చెందిన రమణ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం నడిచింది. తొలిసారిగా 2018 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ బుఖేష్ భగేల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2023లో మళ్లీ ఆ రాష్ట్రంలో అధికార పగ్గాలను బీజేపీ కైవసం చేసుకుంది. విష్ణు దేవ్ సాయి ఆ రాష్ట్ర సీఎంగా ఉన్నారు.

ఈ రాష్ట్రం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ తదితర మొత్తం 7 రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది. రాయ్‌పూర్ దీని రాజధాని. ఇది ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, పరిపాలనా కేంద్రంగా పరిగణించబడుతుంది. విద్యుత్ , ఉక్కు ఉత్పత్తి పరంగా ఈ రాష్ట్రం దేశంలోనే ముఖ్యమైన కేంద్రం. ఇక్కడ ప్రవహించే ముఖ్యమైన నదులు మహానది, హస్దేవ్, శివనాథ్, అర్పా, ఇంద్రావతి, మాండ్, సొంధూర్, ఖరున్ మొదలైనవి. ఛత్తీస్‌గఢ్‌లో 11 లోక్‌సభ స్థానాలు ఉండగా, అందులో 5 స్థానాలు రిజర్వ్‌ చేయబడ్డాయి. వీటిలో 4 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఆ రాష్ట్రంలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్ లోక్‌సభ స్థానాల జాబితా

రాష్ట్రం సీటు అభ్యర్థి పేరు ఓటు పార్టీ స్థితి
Chhattisgarh Rajnandgaon SANTOSH PANDEY 712057 BJP Won
Chhattisgarh Raipur BRIJMOHAN AGRAWAL 1050351 BJP Won
Chhattisgarh Mahasamund ROOP KUMARI CHOUDHARY 703659 BJP Won
Chhattisgarh Kanker BHOJRAJ NAG 597624 BJP Won
Chhattisgarh Surguja CHINTAMANI MAHARAJ 713200 BJP Won
Chhattisgarh Durg VIJAY BAGHEL 956497 BJP Won
Chhattisgarh Korba JYOTSNA CHARANDAS MAHANT 570182 INC Won
Chhattisgarh Bilaspur TOKHAN SAHU 724937 BJP Won
Chhattisgarh Janjgir-Champa KAMLESH JANGDE 678199 BJP Won
Chhattisgarh Bastar MAHESH KASHYAP 458398 BJP Won
Chhattisgarh Raigarh RADHESHYAM RATHIYA 808275 BJP Won

ఛత్తీస్‌గఢ్ దేశంలోని కొత్త రాష్ట్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది 1 నవంబర్ 2000న ఏర్పడి దేశ పటంలో 26వ రాష్ట్రంగా చేరింది. ఛత్తీస్‌గఢ్ గతంలో మధ్యప్రదేశ్‌లో భాగంగా ఉండేది. ఛత్తీస్‌గఢ్ పేరుకు సంబంధించి.. ఒకప్పుడు ఈ ప్రాంతంలో 36 కోటలు ఉండేవని, అందుకే దీనికి ఛత్తీస్‌గఢ్ అని పేరు వచ్చిందని చెబుతారు. విశేషమేమిటంటే, ఆ తర్వాత కాలంలో కోటల సంఖ్య పెరిగింది కానీ పేరులో ఎలాంటి మార్పు లేకపోవడంతో నేడు ఛత్తీస్‌గఢ్‌గా పిలుస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల విషయంలో ఛత్తీస్‌గఢ్‌కు ముఖ్యమైన స్థానం ఉంది. కొన్ని నెలల క్రితం ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించి, 5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. భారీ విజయం సాధించి ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి బిజెపి చాలా సమయం తీసుకుంది. గిరిజన నేత విష్ణుదేవ్ సాయిని బీజేపీ ముఖ్యమంత్రిని చేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా కీలకం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. 50 శాతానికి పైగా ఓట్ల శాతాన్ని సాధించింది, కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలంటే ఎన్డీయే కూటమి 400 దాటాలనే నినాదాన్ని బీజేపీ లేవనెత్తుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘన విజయం సాధించాల్సి ఉంది.

ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి?

సమాధానం - 50.70%

ప్రశ్న - 2019 ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంది?

సమాధానం: 11 స్థానాలకు గాను 9 స్థానాలు గెలుచుకున్నాయి.

ప్రశ్న - 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వచ్చాయి?

సమాధానం - 2 సీట్లు గెలిచాయి

ప్రశ్న - 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పనితీరు ఎలా ఉంది?

సమాధానం: 11 సీట్లకు 10 గెలిచింది.

ప్రశ్న - ఛత్తీస్‌గఢ్‌లో ఎస్సీ-ఎస్టీలకు ఎన్ని సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి?

సమాధానం - 5 సీట్లు

ప్రశ్న - అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌పై బీజేపీ ఎవరిని నిలబెట్టింది?

జవాబు: బీజేపీ లోక్‌సభ ఎంపీ విజయ్‌ బాఘేల్‌ను రంగంలోకి దింపింది.

ప్రశ్న - గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కాంగ్రెస్ ఎంపీ ఓటమి పాలయ్యారు?

సమాధానం: కాంగ్రెస్ ఎంపీ దీపక్ బైజ్ చిత్రకూట్ స్థానం నుంచి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

ప్రశ్న - 2019లో విజయ్ బఘెల్ ఏ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు?

సమాధానం - దుర్గ్ లోక్‌సభ స్థానం

ప్రశ్న - కేంద్ర సహాయ మంత్రి రేణుకా సింగ్ ఏ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు?

సమాధానం - సర్గుజా లోక్‌సభ స్థానం

ప్రశ్న - ఛత్తీస్‌గఢ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు?

సమాధానం - అజిత్ జోగి

ఎన్నికల వార్తలు 2024