తెలుగుదేశం పార్టీ(టీడీపీ) లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) దక్షిణాది రాష్ట్రాల్లోని అతిపెద్ద పార్టీల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ ప్రభావం ఉంది

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) దక్షిణాది రాష్ట్రాల్లోని అతిపెద్ద పార్టీల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ ప్రభావం ఉంది. ఆంద్రప్రదేశ్‌లో అనేకసార్లు అధికారాన్ని చేజిక్కించుకోవడంలో ఆ పార్టీ విజయం సాధించింది. టీడీపీని 29 మార్చి 1982న ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు (ఎన్టీఆర్) స్థాపించారు. తెలుగు మాట్లాడేవారి కోసం పని చేయడమే ఆ పార్టీ లక్ష్యం. పార్టీ పెట్టిన 8 మాసాల్లోనే ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలుమార్లు మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీడీపీ విజయం సాధించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షం. ఇక్కడ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉంది. 

ఎన్టీ రామారావు అల్లుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995 సెప్టెంబర్ 1న టీడీపీ అధ్యక్షుడయ్యారు. అలాగే ఎన్టీ రామారావు స్థానంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ 4 సార్లు సీఎం అయ్యారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఎన్డీయే కూటమికి దూరమయ్యింది. ఇటీవల మళ్లీ ఆ పార్టీ ఎన్డీయే కూటమిలో చేరింది. 2024 జమిలి ఎన్నికల్లో జనసేన పార్టీ, బీజేపీతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది.

భారతదేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు (India's Major Political Parties)
Party Name Leads + Result Party Logo Party President Party Establishment Year
Bharatiya Janata Party JP Nadda April 1980
Indian National Congress Mallikarjun Kharge December 1885
Aam Aadmi Party Arvind Kejriwal November 2012
Bahujan Samaj Party Mayawati April 1984
Communist Party of India (Marxist-Leninist) Sitaram Yechury November 1964
All India Majlis-E-Ittehadul Muslimeen Asaduddin Owaisi November 1927
Bharat Rashtra Samithi K. Chandrashekar Rao April 2001
Telugu Desam N. Chandrababu Naidu March 1982
Yuvajana Sramika Rythu Congress Party YS Jagan Mohan Reddy March 2011